For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'మిథునం' చూసిన దాసరి... ప్రశంసల వర్షం

  By Srikanya
  |

  Dasari Narayana Rao
  హైదరాబాద్: తణికెళ్ల భరిణి దర్శకత్వం వహించిన 'మిథునం' చిత్రానికి అన్నిచోట్ల నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఈ చిత్రం అంద్బుతం అంటూ దర్శకరత్న దాసరి పొగడ్తల్లో ముంచెత్తారు. 'ఒక దర్శకునిగా భరణి ప్రతిభ చూసి గర్వపడుతున్నాను. అతను దర్శకత్వం వహించిన 'మిథునం' చిత్రం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమది' అన్నారు డాక్టర్ దాసరి నారాయణరావు. బాలు, లక్ష్మి పాత్రధారులుగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మిథునం' చిత్రాన్ని చూసిన అనంతరం దాసరి స్పందించి చెప్పిన మాటలివి.

  'ఒక రంగస్థల నటుడు, రచయిత సినీ ప్రయోక్త కాగలితే ఎంత మంచి చిత్రం తీయగలడో అన్న విషయాన్ని మరోసారి రుజువు చేశాడు భరణి. అలాగే తను పోషించిన పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు బాలు. లక్ష్మి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఆ పాత్రని ఆమె పోషించినంత గొప్పగా ఎవరూ చేయలేరు. ఈ తరహా చిత్రాలను ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహించాలి. 'మిథునం' చిత్రానికి వినోదపు పన్నులో రాయితీ ఇస్తే సరిపోదు. ఏడాదికి పది మంచి చిత్రాలను ఎంపిక చేసి, ఒక్కో చిత్రానికి పది లక్షల రూపాయల క్యాష్ సబ్బిడీ ఇవ్వాలంటూ గతంలో ఇచ్చిన జీవోని మళ్లీ పునరుద్ధరించి, ఈ సినిమాతో మళ్లీ అమలులోకి తేవాలి' అన్నారాయన.

  ఈ చిత్రం గురించి తణికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ. పదహారు ప్రాయమైతే ప్రేమలేఖలు రాసుకొనేవాళ్లు. అప్పుడే పెళ్త్లెన జంటైతే చిన్న స్పర్శతో ప్రేమను వ్యక్తం చేసుకొని ఉండేవాళ్లు. కనీసం ముఫ్పైలో ఉన్నా ముద్దుముచ్చట్లలో మునిగేవాళ్లు. కానీ మొన్నే షష్టిపూర్తయ్యింది. ఆ వయసులో జీవితం అంతా పూర్తయిపోయిందనుకొంటారు.. ఎవరైనా! కానీ వాళ్లకు మాత్రం అప్పుడే మొదలైంది. ఆ ప్రేమని ఎలా వ్యక్తం చేసుకొన్నారో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే. 'ఆరుపదుల వయసులో కూడా నూతన దంపతుల్లా కాలం గడిపే జంట ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నమిది. అచ్చ తెలుగు చిత్రమిది అన్నారు తనికెళ్ల భరణి.

  ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆనంద్‌ ముయిదా రావు నిర్మాత. శ్రీకాకుళం జిల్లా వావిలవలస గ్రామంలో సన్నివేశాల్ని తెరకెక్కించారు. 'మిథునం' చిత్రానికి వీణాపాణి స్వరాలు సమకూర్చారు. ఇక గతంలో భరిణి 'సిరా', 'కీ', 'బ్లూ క్రాస్‌' లాంటి లఘు చిత్రాలు రూపొందించి పురస్కారాలు అందుకొన్నారు. 'మిథునం' పూర్తిస్థాయి చలనచిత్రం. ఈ చిత్రం వృద్ధ జంట చుట్టూ తిరుగుతుంది. వీరి ప్రేమాభిమానాలు ప్రధానాంశంగా జీవన వేదాతం ఇమిడి కథ నడుస్తుంది. ఇదే కథలో గతంలో మళయాళంలో ఓ చిత్రం నిర్మించారు. కానీ అది పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. అయితే భరిణిగారు ఈ కథని ఇప్పటి తరానికి అర్దమయ్యేటట్లుగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని,అందరూ చూసేటట్లుగా రూపొందించారు.

  English summary
  Dasari Narayana Rao said that Mithunam is a good film. Tanikella Bharani latest movie Midhunam starring Balasubramanyam and Lakshmi in lead. Hope Midhunam turns out to be a cool flick this Year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X