twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి నారాయణరావు "షార్ట్ ఫిల్మ్ పోటీ''..డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రముఖ దర్శకనిర్మాత దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా ఏటా చిత్ర ప్రముఖులకు, దర్శక, నిర్మాతలకు సన్మానాలు నిర్వహించేవారు. ఈ ఏడాది వినూత్నంగా లఘు చిత్రాల పోటీని నిర్వహిస్తున్నారు. దాసరి పుట్టిన రోజు వేడుకలో మే 4న రవీంద్ర భారతిలో విజేతలను ప్రకటించి ఆయన చేతుల మీదుగా బహుమతులను అందజేయనున్నారు. ఈ పోటీ వివరాల్ని దాసరి జన్మదినోత్సవ కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, కన్వీనర్‌ రేలంగి నరసింహారావు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో తెలిపారు. ఐదు నుంచి 25 నిమిషాల నిడివి ఉన్న లఘుచిత్రాల్ని పోటీకి ఆహ్వానిస్తున్నారు. ఇవి సామాజిక సమస్యల్ని ప్రతిబింబించేలా ఉండాలి. పూర్తి వివరాల్ని హైదరాబాద్‌లోని చరిత చిత్ర కార్యాయలం నుంచి తెలుసుకోవచ్చు .

    తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ "సినిమా పరిశ్రమకు కొత్త నీరు రావాలి అని దాసరి గారు ఎప్పుడూ అంటుంటారు. ఆయన ప్రతి జన్మదిన వేడుకల్లో దర్శక నిర్మాతలను సన్మానిస్తుంటారు. సాకేతింకత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంల ఓఎన్నో షార్ట్ ఫిలింస్ వచ్చాయి. ఎంతో మంది దర్శకులు, నటీ నటులు వీటి ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి. సినిమాకు కూడా సంబంధం ఉంటే ఇంకా ఎస్టాబ్లిష్ కావచ్చు అనే ఉద్దేశ్యంతో పాటు, దీని ద్వారా ఎంతో మంది కళాకారులను కూడా ప్రోత్సహించవచ్చు అన్న అభిప్రాయంతో ఈ లఘు చిత్రాల పోటీని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి'' అన్నారు.

    Dasari Narayana Rao' Short film competition

    రేలంగి నరసిహారావు మాట్లాడుతూ "దాసరి గారి లాంటి వారు ఇలాంటి పోటీని నిర్వహించడం గొప్ప విషయం, ఇది షార్ట్ ఫిలిం దర్శక నిర్మాతలకు గొప్ప అవకాశం అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఆ పోటీల్లో పాల్గొనవచ్చు. ఆయన చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం అంటే ఎంత గౌరవమో నేను ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఇందుకు గాను కొన్ని నియమ నిబంధనలుఉన్నాయి.. అవి.. సమాజిక స్పృహతో ఉన్న షార్ట్ ఫిలింస్ మాత్రమే పంపాలి. అవి ఐదునిమిషాల నిడివికి తగ్గకుండా....ఇరవై ఐదు నిమిషాలకు మించకుండా ఉండాలి. ఏప్రిల్ 26 వ తేదీ చివరి తేదీ. లఘు చిత్రాలను డివిడి ఫార్మాట్ లో మాత్రమే పంపించాలి. మొదటి, రెండవ,మూడవ బెస్ట్ ఫిలింస్ గా ఎంపికైన విజేతలకు నగదు బహుమతి, జ్జాపిక,ప్రశంసా పత్రము అందజేయబడతాయి. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ కూడా దాసరి గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రధానం చేయబడతాయి అన్నారు.

    నియమాలుః
    1.జనవరి 1,2013 తరువాత నిర్మించిన లేదా రిలీజ్ (వెబ్/పబ్లిక్ డొమైన్)అయిన లఘుచిత్రాల్ని మాత్రమే పంపాలి.
    2.నిడివి 5 నుంచీ 25 నిమిషాలకు మించరాదు.
    3.సామాజికస్పృహ/సామాజిక విషయం ఉన్న చిత్రాలను మాత్రమే పంపవలెను.
    4. షార్ట్ ఫిల్మ్స్ ని డివిడి రూపంలో పూర్తివివరాలను, నిర్మాతాదర్శకుల రెండు పాస్ పొర్ట్ సైజ్ ఫోటోలు, బయోడేటాను జతపరుస్తూ ఈ క్రింది అడ్రసుకు పంపండి.
    5. 26th ఏప్రిల్ 2014 ఎంట్రీలకు ఆఖరి తేదీ.

    చరితచిత్ర
    ప్లాట్ నెంబర్ 108
    గ్రీన్ బావర్చి వెనక
    కమలాపుర్ కాలని
    హైదరాబాద్

    ఫోన్ నెంబర్ః 9248077791,9000998503

    English summary
    In order to mark the celebration of Dr.Dasari Narayana Rao's birthday, a short film competition has been organized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X