For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో వివాదంలో దాసరి అరుణ్.. వెంటాడి అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏమైందంటే?

  |

  తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దగా చాలా కాలం పాటు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా అనేక విషయాలకు అండగా నిలిచేవారి దాసరి నారాయణరావు. ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు అజరామరం. అయితే ఆయన పేరు నిలబెట్టాల్సిన కుమారులు అనేక మార్లు పోలీస్ స్టెయిన్ మెట్లు ఎక్కుతూ సంచలనంగా మారుతున్నారు. తాజాగా ఆయన కుమారుడు దాసరి అరుణ్ అరెస్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

   కెరీర్ కి బ్రేక్

  కెరీర్ కి బ్రేక్

  దాసరి కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు కనిపిస్తాయి. రచయితగా .. దర్శకుడిగా ... నటుడిగా .. నిర్మాతగా ఆయన అనేక సినిమాల్లో తనదైన సత్తా చాటారు. ఎంతోమంది కొత్త నటీనటులను దాసరి పరిచయం చేశారు. మరెంతో మంది కెరీర్ కి బ్రేక్ కూడా ఇచ్చారు. అలాంటి దాసరి నారాయణరావు తన తనయుడు అరుణ్ కుమార్ ను కూడా ‘గ్రీకు వీరుడు' సినిమాతో హీరోగా పరిచయం చేశారు.

  సినిమాలపై దృష్టి పెట్టలేదు

  సినిమాలపై దృష్టి పెట్టలేదు


  అయితే పరిస్థితులు అనుకూలించక పోవడం వలన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అరుణ్ కుమార్ మంచి ఒడ్డూ పొడుగూ ఉన్నాడు. డాన్స్ .. ఫైట్స్ ఓకే, నటన పరంగా కాస్త కష్టపడితే దారిలో పడిపోతాడని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన ‘చిన్నా‘ .. ‘ఒరేయ్ తమ్ముడు' .. ‘ఆదివిష్ణు' వంటి సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. అయితే అవేవీ కూడా ఆయన కెరీర్ కి హెల్ప్ కాలేకపోయాయి. ఆరంభంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, ఇక ఆయన సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

  మరో వివాదంలో దాసరి అరుణ్

  మరో వివాదంలో దాసరి అరుణ్

  దాసరి కుమారులు ఆయన చనిపోయాక ఆస్తి గొడవలతో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు లాంటి వారు పట్టించుకుని ఒక సెటిల్మెంట్ చేస్తానన్నారని, కానీ ఆయన అలాంటిది ఏమీ చేయడం లేదని ఒకటిరెండు సార్లు దాసరి కోడలు మీడియా ముందుకు వచ్చారు. అలాగే ఆ మధ్య ఒకరిని చంపేస్తానని బెదిరించిన వివాదం నుంచి తేరుకోకముందే మరో వివాదంలో దాసరి చిన్న కుమారుడు అరుణ్ చిక్కుకున్నాడు.

  అదుపులోకి

  అదుపులోకి


  గురువారం తెల్లవారుజామున మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెండు బైక్ లను ఢీ కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడ అరుణ్ ఆగకపోవడంతో పోలీసులు అతనిని పట్టుకోలేకపోయారు. కారు ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు అది దాసరి అరుణ్ కుమార్ కారుగా గుర్తించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

  Dasari Film Awards Function || Filmibeat Telugu
  కేసు నమోదు చేసి

  కేసు నమోదు చేసి

  పోలీస్ స్టేషన్‌కి పిలిపించిన పోలీసులు ఆయనకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఆయన మద్యం తాగి ఉన్నట్టు తేలడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ యాక్ట్ 1988, ఐపీసీ 185, 304 కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు బ్రీత్‌ అనలైజర్‌ టెస్ట్‌ చేయగా 405 సూచించిందని, వెంటనే ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరుణ్ పై కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

  English summary
  Dasari Narayanaro son dasari arun arrested in drunk and drive case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion