twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' ప్రారంభం

    By Srikanya
    |

    ప్రముఖ దర్శక,నిర్మాత దాసరి నారాయణ రావు తన తాజా చిత్రం 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. సమకాలీన రాజకీయ వాతావరణం నేపథ్యంతో తయారయ్యే ఈ చిత్రంలో ఆయన స్వయంగా ప్రధాన పాత్ర చేయబోతున్నారు. 'పరమవీరచక్ర' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. కొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' అనే టైటిల్‌తో దాసరి ఓ చిత్రాన్ని రూపొందించ బోతున్నారనే వార్త ఇటు సినీ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నూట యాభై చిత్రాల దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు ఈ కొత్త చిత్రం ద్వారా ఏం చూపెట్టబోతున్నాడనే విషయం అంతటా చర్చనీయాంశమైంది.

    ఇక రాజకీయ ప్రత్యర్థులపై దర్శకరత్న దాసరి నారాయణ రావు ఈ సినిమా అస్త్రాన్ని ప్రయోగించనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రతిపక్షాలపై వ్యంగ్య చిత్రాలు తీసిన దాసరి ఈసారి మాత్రం సొంత పార్టీ నేతల పైనే తీయనున్నారని తెలుస్తోంది. ఆయన అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో నమోదు చేసినట్లుగా సమాచారం. త్వరలో తన పదవి ముగుస్తుండటం, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం, చిరుకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తుండటం వంటి ఇలాంటి సమయంలో దాసరి అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్ నమోదు చేయించారనే వార్త చర్చకు దారి తీసింది.

    గత సాధారణ ఎన్నికలకు ముందు ఆయన మేస్త్రీ అనే చిత్రాన్ని తీశారు. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవిని లక్ష్యంగా చేసుకొనే ఆయన ఈ సినిమా తీసినట్టు ప్రచారం జరిగింది. అంతకుముందు తీసిన పిచ్చోడి చేతిలో రాయి టిడిపిని లక్ష్యంగా పెట్టుకొని తీసిందేననే వాదనలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై సినిమా ద్వారా వ్యంగ్యాస్త్రాలు ఎక్కు పెట్టడంలో దాసరికి ఎవరూ సాటి లేరనే చెప్పవచ్చు. గతంలో ఓసారి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓ సినిమా తీసేందుకు దాసరి సిద్ధమైన సమయంలో ప్రస్తుత కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఆయనను వద్దని చెప్పారట.

    ఆయన తాజాగా తలపెట్టిన చిత్రం 2014 ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు. ఇందులో ఆర్టిస్టులు ఎవరో ఇంకా ఖరారు కాలేదు. సొంతపార్టీలోని ప్రత్యర్థులను టార్గెట్ చేయడం ద్వారా దాసరి సంచలనానికి తెరదీయబోతున్నారని అంటున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో దాసరి తన ఉదయం పత్రిక ద్వారా ఆయనను టార్గెట్ చేశారు. అయితే అప్పుడు కాంగ్రెసులో ఉండటంతో టిడిపి, ఆ తర్వాత మేస్త్రీ ద్వారా చిరంజీవిని టార్గెట్ చేశారు. మారిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసుకోవడం విశేషం.

    English summary
    Filmmaker and Congress leader Dasari Narayana Rao is planned to make a picture on latest political issues titled 'Assembly lo Dongalu Paddaru'. This film may released before 2014 election. Dasari Narayana Rao drops a bomb with the announcement of the title of his new film, Assembly Lo Dongalu Paddaru, which he calls a satire on politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X