»   » తెరంగ్రేటానికి సిద్ధమైన దాసరి మనవరాలు

తెరంగ్రేటానికి సిద్ధమైన దాసరి మనవరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇతర ఇండస్ట్రీల మాదిరిగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా వారుసులతో నిండిపోయిన సంగతి తెలిసిందే. విమర్శించడానికి ఇలా చెప్పడం లేదు. ఉన్న విషయం చెబుతున్నామంతే! సినిమా పరిశ్రమలోనే కాదు....అన్ని రంగాల్లోనూ పరిస్థితి ఇంతే. కుటుంబంలోని పెద్దలను చూసి పిల్లలు ఆ రంగం వైపు ఆకర్షితులవ్వడం సాధారణమే.

తాజాగా ఇండస్ట్రీలోకి మరొకరు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు మనవరాలు నీరాజిత తెరంగ్రేతం చేయబోతోందని తెలుస్తోంది. ఆమె పాత్ర ఏ విధంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. దాస‌రి నారాయ‌ణ‌రావు తన 151వ సినిమాగా ఓ సినిమాగా మొదలు పెట్టాడు. విష్ణు క‌థానాయ‌కుడు. కేథ‌రిన్ నాయిక‌. ఈ చిత్రానికి ఎర్ర బ‌స్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు.

రెండు రోజుల క్రితం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ఈ చిత్రం ప్రారంభ‌మైంది. ఈనెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. చక్రి స్వ‌రాలు అందిస్తున్నాడు. ప‌ర‌వ‌వీర‌చ‌క్ర త‌ర‌వాత దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇదే.

Dasari's Granddaughter set for Debut

త‌మిళ చిత్రం మంజ‌పాయ్‌కి రీమేక్ ఇది. రెండు వారాల క్రితం తమిళంలో విడుదలైన 'మంజాపాయ్' ఘన విజయాన్ని సాధించి.. కమర్షియల్‌గా కొత్త పుంతలు తొక్కింది. ఎన్.రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాతా-మనవళ్ల అనుబంధం తాలూకు హృద్యమైన కథనం.

పూర్తి స్థాయి హాస్య ప్రధానాంశంగానూ.. మరోవైపు సెంటిమెంట్‌ని వొలకబోసి రూపొందిన ఈ చిత్రంలో రాజ్ కిరణ్, విమల్, లక్ష్మీ మీనన్ నటించారు. లోబడ్జెట్ సినిమా. కానీ ఇరవై కోట్ల పైచిలుకు వసూళ్లు చేస్తోందని అంచనా. పర భాషలో ఏ కథైనా 'హిట్' కొట్టిందా? రీమేక్ అంటూ టాలీవుడ్ ఉవ్విళ్లూరటం పరిపాటి. రీమేక్ హక్కుల కోసం లగడపాటి శ్రీధర్, సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ ఎంతగా ప్రయత్నించినప్పటికీ 'దాసరి' ఫ్యాన్సీ రైట్స్‌తో ఆ చిత్రాన్ని కొనేశాడు.

English summary
Dasari Narayana Rao is again getting ready to hold the megaphone. Another flick is likely to be queued in Tollywood. Vishnu is the lead role. Catherine would be the heroine. The title ‘Erra Bus’ has been finalised for this movie. Dasari's granddaughter Neerajitha is making her debut in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu