»   »  నిర్మాతలపై దాసరి ఘాటుగానే సెటైర్

నిర్మాతలపై దాసరి ఘాటుగానే సెటైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉన్నట్టుండి బడ్జెట్‌ అదుపులో పెట్టడానికి నిర్మాతలంతా ఏకమై.. ఏవో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది వరకూ ఇలానే జరిగింది. తీరా చూస్తే.. మీటింగులయ్యాకే ఖర్చు మరింత పెరిగింది అంటూ దాసరి నారాయణ రావు వ్యంగ్యాస్త్రం సంధించారు. సోమవారం దాసరి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు మాట్లాడుతూ ఇలా స్పందించారు.

ఇక పెద్ద పెద్ద సినిమాలూ, పేరున్న హీరోల చిత్రాలూ విడుదల ముందు 'వాయిదా'ల పర్వం కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
నిర్మాతకి తన సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు బయటకు వస్తుందో తెలీదు. నిర్మాతకే తెలీనప్పుడు.. ఆ సినిమా పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'విజివల్‌ ఎఫెక్ట్స్‌ పని జరుగుతోంది' అంటారు.

ఎన్ని సినిమాలకు చేస్తున్నారో, ఆ పని ఏయే కంపెనీలకు ఇస్తున్నారో తెలీదు. డబ్బింగ్‌ చెప్పడం ఎంత బాకీ ఉందో తెలీదు. అయినా సరే.. 'మేం దసరాకి వస్తున్నాం. దీపావళికి వస్తున్నాం.' అంటారు. తీరా చూస్తే. ఆ సినిమాలు రావు. దాంతో అటు చిన్న సినిమాలూ ఆగిపోతున్నాయి.

Dasari's Satire On Producers' Decision!!

అలాగే...బెనిఫిట్‌ షో పేరిట రూ. ఐదు వేలకూ, ఆరు వేలకూ కూడా టిక్కెట్లు అమ్ముకుంటూ జనాన్ని దోచుకుంటున్నారనీ, చేతకాని ప్రభుత్వాల వల్లే ఈ బెనిఫిట్‌ షోలు వేస్తున్నారనీ దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్రంగా విమర్శించారు. ఆన్‌లైన్‌ విధానం ద్వారా టిక్కెట్ల అమ్మకం జరిగితే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందనీ, అయితే ప్రభుత్వాలు ఈ విషయమై ఏమాత్రం పట్టించుకోవడం లేదనీ ధ్వజమెత్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఓ సినిమా ఫ్లాప్‌ అయితే.. పంపిణీదారులంతా హీరోలపై పడుతున్నారు. నష్ట పరిహారం చెల్లించమంటున్నారు. ఈ విషయంలో నేను విబేధిస్తా. హీరోలు నిర్మాతల ఇంటికొచ్చి తలుపుతట్టి.. 'మాతో సినిమా తీయండి..' అని అడుగుతున్నారా? నిర్మాతలే హీరోల చుట్టూ, దర్శకుల చుట్టూ తిరుగుతున్నారు. 'బాబూ.. మీతోనే సినిమా చేస్తా. మీరు ఎప్పుడంటే అప్పుడే' అంటున్నారు. అడక్కుండానే అడ్వాన్సులు చేతిలో పెడుతున్నారు.

అలాంటప్పుడు సినిమా పోతే... హీరో, దర్శకుడో తిరిగి డబ్బులు ఎందుకు చెల్లించాలి? ఎవరినీ డిమాండ్‌ చేయొద్దు. కొంతమంది వాళ్లంతట వాళ్లే.. చేయూతనివ్వడానికి ముందుకొస్తున్నారు. అలాంటి వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటాడు పవన్‌ కల్యాణ్‌. నాగార్జున కూడా రెండు మూడు సినిమాలు కష్టాల్లో ఉన్నప్పుడు తన భుజాలపై వేసుకొని విడుదల చేశాడు.

కొంతమంది హీరోలు 'ఇవ్వాల్సింది ఇవ్వకపోతే డబ్బింగ్‌ చెప్పం..' అని మొండికేస్తున్నారట. అది వాళ్ల పద్ధతి. డబ్బింగ్‌ చెప్పాక.. పారితోషికం ఇవ్వకపోతే? ఇలాంటివి నేను ఎన్ని చూళ్లేదు.? ఇవేం ఎవ్వరినీ నొప్పించడానికి చెబుతున్న మాటలు కావు. నా అనుభవంలో ఇలాంటి కేసులు చాలా చూశా. 'సినిమా కష్టాల్లో ఉందండీ.. హీరోకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి..' అనే నిర్మాతలు మన చుట్టూ చాలామందే ఉన్నారు అని అన్నారు.

English summary
On the eve of his birthday today, Dasari spoke to some leading media houses to say that decisions taken by producers always lead to increased in budgets.
Please Wait while comments are loading...