»   » ఆ హీరో హీరోయిన్ లవ్ ఎఫైర్ గురించి దాసరి ఇలా...!

ఆ హీరో హీరోయిన్ లవ్ ఎఫైర్ గురించి దాసరి ఇలా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శక‌రత్న దాసరి నారాయణ రావు ఏదైనా కార్యక్రమంలో....లేదా మీడియా సమావేశంలో పాల్గొంటే మీడియా వారు చాలా ఆసక్తిగా ఆయన ప్రసంగాలను గమనిస్తుంటారు. ఆయన మీడియా ముందుకు వచ్చారంటే ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం చేస్తుంటారు. సాధారణంగా ఆయన ప్రసంగంలో పొగడ్తలు లేదంటే విమర్శలే ఎక్కువగా ఉంటాయి.

ఇటీవల ఓ సందర్భంలో దాసరి నారాయణ రావు మీడియా ప్రస్తావన తెస్తూ....ఉదాహరణగా ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. 80ల్లో పాపులర్ అయిన ఓ హీరో, హీరోయిన్ మధ్య ఎఫైర్ ఉందని, హోటల్ రూములో వారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్లు చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు మీడియా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని, ఆ హీరోకు మీడియాతో పాటు ఇండస్ట్రీలో మంచి రిలేషన్ షిప్ ఉండేదని తెలిపారు. మీడియా వారు ఇలాంటి విషయాల్లో చాలా ఆలస్యమే అని చెప్పుకొచ్చాచ్చారు. దాసరి నారాయణ రావు లాంటి సీనియర్ దర్శకుడు ఇలాంటి విషయాన్ని ఉదాహరణగా చెప్పడం పలువురిని ఆశ్చర్య పరిచింది. అయితే వారి పేర్లను మాత్రం దాసరి బయట పెట్టలేదు.

Dasari said about Hero, Heroine affair

ఆ సంగతి పక్కన పెడితే దాసరి తన 151వ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. విష్ణు క‌థానాయ‌కుడు. కేథ‌రిన్ నాయిక‌. ఈ చిత్రానికి ఎర్ర బ‌స్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఇటీవలే పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ఈ చిత్రం ప్రారంభ‌మైంది. ఈనెలాఖ‌రు నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. చక్రి స్వ‌రాలు అందిస్తున్నాడు. ప‌ర‌వ‌వీర‌చ‌క్ర త‌ర‌వాత దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇదే.

త‌మిళ చిత్రం మంజ‌పాయ్‌కి రీమేక్ ఇది. రెండు వారాల క్రితం తమిళంలో విడుదలైన 'మంజాపాయ్' ఘన విజయాన్ని సాధించి.. కమర్షియల్‌గా కొత్త పుంతలు తొక్కింది. ఎన్.రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాతా-మనవళ్ల అనుబంధం తాలూకు హృద్యమైన కథనం.

English summary
Dasari Narayana Rao admittedly said that in 80s during shooting of a movie said that a leading hero and heroine were caught red handed indulging in love making inside a hotel room.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu