»   » ఇండస్ట్రీ చూపింకా ఇక్కడ పడలేదా?? టాలీవుడ్ కి ఇంకో విలన్ దొరికినట్టే

ఇండస్ట్రీ చూపింకా ఇక్కడ పడలేదా?? టాలీవుడ్ కి ఇంకో విలన్ దొరికినట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

దయానంద్ రెడ్డి బహుశా నిన్నా మొన్నటి వరకూ ఇండస్ట్రీలోని అతి కొద్దిమంది కి తప్ప బయట పెద్దగా తెలియని పేరు.. కొందరికి తెలిసినా ఫ్లాప్ డైరెక్టర్ అన్న చిన్న చూపు చూసిన పేరు.. కేవలం అవార్డు ప్రకటించటం లేటైనందు వల్ల దయా మూడేళ్ళు ఒక ఫెయిల్యూర్ లాంటి నీడని మోస్తూ బతికారు...

దయా కొడవటిగంటి

దయా కొడవటిగంటి

ఇప్పుడు మాత్రం ఆఫర్లతో, అభినందనలతో మునిగిపోతున్నారు అయితే రెండుసందర్భాల్లోనూ ఒకేలా ఉన్నట్టున్నారు... "ఈ రోజు కూడా మారిపోతుంది" అన్న సూక్తి బాగాతెలుసనుకుంటా... దేన్నైనా ఒకేలా తీసుకుంటేనే ఎక్కడైనా బతగ్గలం, ఎలా అయినా గెలవగలం అన్న విషయం మరోసారి ఇక్కడ ఋజువయ్యింది.

ఉత్తమ దర్శకుడిగా నందీ అవార్డ్

ఉత్తమ దర్శకుడిగా నందీ అవార్డ్

2013 సంవత్సరానికి గానూ ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన దయా కొడవటిగంటి ఇండస్ట్రీలో చాలా కాలంగానే ఉన్నా... పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు అయితే ఎప్పుడైతే నందీ అవార్డ్ ల ప్రకటన వచ్చిందో అప్పుడు ఒక్క సారిగా ఈ దర్శకుడి వైపు తిరిగింది ఇండస్ట్రీ చూపు...

పవన్‌కళ్యాణ్ దగ్గర

పవన్‌కళ్యాణ్ దగ్గర

నిజానికి దయానంద్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో కనిపించాడు గానీ ఫోకస్ అంతా దర్శకత్వం మీద ఉండటం వల్లో ఏమో గానీ ఆ నటనను సీరియస్ గా తీసుకున్నట్టు లేడు. స్టార్ హీరో పవన్‌కళ్యాణ్ దగ్గర ఎంతో కాలంపాటు పనిచేశాడు. జానీ చిత్రం నుంచి పంజా సినిమా వరకు ఆయన వద్ద వర్క్ చేసిన దయానంద్.

అలియాస్ జానకి

అలియాస్ జానకి

‘పంజా' సమయంలో నీలిమ తిరుమలశెట్టితో పరిచయంఅవటం తో. వారి బ్యానర్‌లో ‘అలియాస్ జానకి' చేసాడు. ఆతర్వాత మళ్లీ పవన్‌కళ్యాణ్ దగ్గరికే చేరి. ‘సర్దార్ గబ్బర్‌సింగ్' మొదలయ్యే వరకు ఆ టీమ్‌తో తోనే ఉన్నాడు.ఆ తర్వాత మళ్ళీ ఒక సారి మెగా ఫోన్ పట్టుకొని సిద్దర్థ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు...

ఫేస్బుక్ వాల్ మీద

ఫేస్బుక్ వాల్ మీద

ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య ఈ దర్శకుడు తన ఫేస్బుక్ వాల్ మీద పెడుతున్న ఫొటోలు చూస్తే దయానంద్ ఎందుకని యాక్టింగ్ ని సీరియస్ గా తీసుకోలేదన్న మాట వినిపిస్తోంది. హాలీవుడ్ విలన్ లుక్ ని తలపించేలా ఉన్న ఈ ఫొటోలు ఇంకా మిగతా దర్శకుల దృష్టిలో పడ్డాయో లేదో గానీ.

స్పందన కూడా బాగానే ఉంది

స్పందన కూడా బాగానే ఉంది

దయానంద్ ని మళ్ళీ ఒక సారి తెరమీద నటుడిగా చూడాలనిపించేలా ఉన్నాయి ఈ ఫొటోలు. ఆయన ఫాలోవర్లనుంచి వస్తున్న స్పందన కూడా బాగానే ఉంది. కాబట్టి ఒక సారి దయా కూడా నటన వైపు చిన్న లుక్కేస్తే ఎలా ఉంటుందో మరి. ఇంతకీ ఈ మాట దయానంద్ రెడ్ది చెవిలో ఎవరన్నా వేసారో లేదో....

English summary
Dayanand Reddy who bagged Nandi award for 2013 as Best Director, photos gone viral in facebook
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu