»   » చంపేస్తాం.. బుల్లెట్లు దూసుకెళ్తాయి.. అలియాకు డీ గ్యాంగ్ వార్నింగ్

చంపేస్తాం.. బుల్లెట్లు దూసుకెళ్తాయి.. అలియాకు డీ గ్యాంగ్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి అలియాభట్, ఆమె కుటుంబాన్ని చంపేస్తామని గుర్తు తెలియని అగంతకులు బెదిరించారు. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు, అలియా తండ్రి మహేశ్ భట్ ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం మహేశ్ భట్ కుటుంబాన్ని మట్టుబెడుతామని బెదిరించిన పలువురి గతంలో అరెస్ట్ చేశారు.

50 లక్షలు డిపాజిట్ చేయాలని హెచ్చరిక

50 లక్షలు డిపాజిట్ చేయాలని హెచ్చరిక


అలియాభట్ కుటుంబాన్ని మరోసారి అగంతకులు ఫోన్‌లో బెదిరించారు. రూ.50 లక్షలు లక్నోలోని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని హెచ్చరించారు. లేకపోతే అలియాను, ఆమె తల్లి సోని రజ్దాన్‌ను చంపివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని తొలుత నకిలీ ఫోన్ కాల్‌గా భావించారు. కానీ ఆ తర్వాత వాట్సప్ మెసేజ్‌ కూడా రావడంతో దీనిని సీరియస్‌గా తీసుకొన్నారు.

బుల్లెట్లు దూసుకెళ్తాయి.. అలియాకు హెచ్చరిక

బుల్లెట్లు దూసుకెళ్తాయి.. అలియాకు హెచ్చరిక

వాట్సప్ మేసెజ్ ఉన్న ప్రకారం.. ‘మేం చెప్పిన డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే కొన్ని రౌండ్ల బుల్లెట్లు నీ కూతురు అలియా, భార్య సోని దేహంలోకి దూసుకెళ్తాయి' అని బెదిరించారు.

జుహు పోలీస్‌స్టేషన్‌లో భట్ ఫిర్యాదు

జుహు పోలీస్‌స్టేషన్‌లో భట్ ఫిర్యాదు

దాంతో ఆందోళనకు గురైన భట్ ఫ్యామిలీ జుహు పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్ 387 ప్రకారం కేసు నమోదు చేశారు. ముంబై పోలీసుల భట్ ఫ్యామిలీ నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. భట్ నివాసం వద్ద భారీ భద్రతను కల్పించారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్‌కు బదిలీ చేశారు.

రెండేండ్ల క్రితం భట్ కుటుంబానికి ఇలానే..

రెండేండ్ల క్రితం భట్ కుటుంబానికి ఇలానే..

రెండేండ్ల క్రితం ఈ విధంగానే బెదిరించిన 13 మంది దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 2014లో మహేశ్‌భట్ కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు చేసిన కుట్రను భగ్నం చేశారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఫోన్ బెదిరింపులు రావడం బాలీవుడ్ ప్రముఖులను ఆందోళనకు గురిచేస్తున్నది.

English summary
Two years after over 13 people who had plotted to kill the Bhatt family were arrested, Mahesh Bhatt has received another extortion call. An unidentified individual has reportedly demanded Rs 50 lakh from Bhatt and threatened to kill his wife Soni Razdan and daughter Alia Bhatt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu