నిన్న బిచ్చగాడికి... ఇపుడు మహేష్ బాబుకి!

By Bojja Kumar

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నారు. ఈ నెల 29 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైంది.

Deepa Ramanujam as Mahesh Babu’s Mother

ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలో కోలీవుడ్ నటి దీపా రామానుజమ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన 'బిచ్చగాడు' సినిమాలో తల్లి పాత్రలో అందరినీ ఆకట్టుకున్న ఆమె... ఇపుడు మహేష్ బాబుకు తల్లిగా కనిపించబోతోంది.

మహేష్ బాబు ఈ సినిమాతో తమిళంలోనూ తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. అందుకే మురుగదాస్ దర్శకత్వలో చేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఒకేసారి తెరకెక్కబోతోంది. అందుకే నటీనటుల ఎంపిక విషయంలో రెండు బాషల నటీనటులు బ్యాలెన్స్ గా ఉండేలా చూసుకుంటున్నారు.

Deepa Ramanujam as Mahesh Babu’s Mother

ఈ సినిమాలో దర్శకుడు ఎస్.జె.సూర్య కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మహేష్ బాబుకు విలన్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఎస్.జె.సూర్య భార్య పాత్రలో అత్తారంటికి ఫేం నదియా నటించబోతున్నట్లు టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X