»   » మీసాలు కట్ చేస్తూ... దీపికా పదుకొణె (వీడియో)

మీసాలు కట్ చేస్తూ... దీపికా పదుకొణె (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాజీరావ్ మస్తానీ చిత్రంలో బాజీరావ్‌గా రణ్‌వీర్ సింగ్ నటించగా ఆయన మొదటి భార్య కాశీబాయ్ పాత్రలో ప్రియాంక చోప్రా , మస్తానీ పాత్రలో దీపిక నటించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మొదటి నుండి భారీ ప్రమోషన్‌లే చేయగా, మొత్తానికి ఈ చిత్రం మంచి సక్సెస్ నే సాధించినట్టు టాక్. ఇంక రణ్‌వీర్‌సింగ్ కూడా ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తన మీసాలను షార్ప్‌గా పెంచుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు.

 Deepika Padukone Just Cut Ranveer Singh’s Moustache Off

బాజీరావు మస్తానీ చిత్రంలో బాజీరావు పాత్ర కోసం రణ్‌వీర్‌ సింగ్‌ పెంచుకున్న మీసాలను దీపికా పదుకొణె కత్తించారు. దీనికి సంబంధించిన ఓ సరదా వీడియోను రణ్‌వీర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.


రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటించిన చిత్రం బాజీరావ్‌ మస్తానీ. ఈ చిత్రంలో బాజీరావ్‌ మొదటి భార్య కాశీబాయ్‌ పాత్రలో ప్రియాంక చోప్రా, రెండో భార్య మస్తానీ పాత్రలో దీపికా పదుకొణె నటించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.
 Deepika Padukone Just Cut Ranveer Singh’s Moustache Off

కలెక్షన్స్ విషయానికి వస్తే...

మరాఠా యోధుడు పీష్వా బాజీరావ్‌ జీవిత కథ ఆధారంగా సంజయ్‌ లీలా బన్సాలీ తెరకెక్కించిన చిత్రం బాజీరావు మస్తానీ. ఈ చిత్రం కలెక్షన్ల వివరాలను బాలీవుడ్‌ చిత్రాల విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు.

ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం విడుదలైన 3050 థియేటర్లలో రూ.12.80 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. విమర్శకుల అభినందనలు, సమీక్షల ప్రభావంతో శని, ఆది వారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికి వస్తే.. దిల్‌వాలే చిత్రం కంటే వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యూకేలో స్టార్‌వార్స్‌ కలెక్షన్లలో తొలిస్థానం దక్కించుకోగా.. దిల్‌వాలే రెండో స్థానంలో ఉంది. ఇక బాజీరావు మస్తానీ ఏడో స్థానంలో నిలిచినట్లు తరణ్‌ ఆదర్శ్‌ తెలిపారు.

English summary
Deepika Padukone took a pair of scissors and ruthlessly cut off his moustache. Just look at Ranveer Singh’s face filled with apprehension. And on the contrary, Deepika hasn’t looked this happier.
Please Wait while comments are loading...