»   » దీపికా, రణ్‌వీర్ అఫైర్ బ్రేక్ అప్

దీపికా, రణ్‌వీర్ అఫైర్ బ్రేక్ అప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో దీపికా పదుకోనె, రణ్‌వీర్ సింగ్‌ల మధ్య అఫైర్ బహిరంగమే. వారిద్దరి మధ్య సంబంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ వారిద్దరి అఫైర్ బ్రేక్ అప్ అయిందనే వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

రామ్‌లీలా చిత్ర షూటింగ్ అఫైర్

రామ్‌లీలా చిత్ర షూటింగ్ అఫైర్

దీపికా, రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ సంజయ్ లీలా భన్సాలీ చిత్రం గోలియోంకీ రాస్ లీలా రామ్ లీలా చిత్రం షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే ఒప్పుకొన్నారు. అప్పటి నుంచి వారిద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు.

హాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత బ్రేక్ అప్

హాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత బ్రేక్ అప్

కానీ దీపికా పదుకొనే హాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి మార్పు వచ్చింది. గత డిసెంబర్ నుంచి వారిద్దరు మధ్య సంబంధాలు బెడిసి కొట్టినట్టే కనిపిస్తున్నాయి. వీరిద్దరూ న్యూఇయర్ ను దుబాయ్‌లో జరుపుకోన్నారు. ఆ సందర్భంగా రణ్‌వీర్ ఒక్కడే ఇండియాకు తిరిగివచ్చారు.

హాలీవుడ్ నటుడు విన్ డిజిల్ కారణమా?

హాలీవుడ్ నటుడు విన్ డిజిల్ కారణమా?

వీరిద్దరి మధ్య అఫైర్ బ్రేక్ అప్ కావడానికి కారణం హాలీవుడ్ నటుడు విన్ డిజిల్. విన్ డిజిల్‌తో దీపికా సన్నిహితంగా ఉండటమే వారి సంబంధాలు చెడిపోయాయనే కారణం వినిపిస్తున్నది. బ్రేక్ అప్ గురించి దీపికాను మీడియా అడిగినప్పడు వారిపై ఆమె చిర్రుబుర్రులాడింది.

రామ్ ఇంకా లీలాతోనే ఉన్నాడు..

రామ్ ఇంకా లీలాతోనే ఉన్నాడు..

ఇదిలాఉండగా, రామ్ ఇంకా లీలాతోనే ఉన్నాడని ప్రియాంక చోప్రాతో దర్శకుడు కరణ్ జోహర్ అనడం మరింత ఆసక్తిని రేపింది. ఇంతకు దీపికా, రణ్‌వీర్ అఫైర్ కొనసాగుతున్నట్టా? లేక బ్రేక్ అప్ అయినట్టా అనే విషయం కొద్దిరోజులు ఆగితే తెలువడం ఖాయం.

English summary
Deepika Padukone, Ranveer Singh relationship was going through a rough patch resurfaced when they reportedly took off to Dubai to spend the New Year together. Deepika's closeness to her xXx: Return Of Xander Cage co-star Vin Diesel was also said to have caused problems.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu