For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కొత్త అవతారమెత్తుతున్న దీపికా పదుకొనె

  By Srikanya
  |

  ముంబై: గ్లామర్‌ ప్రపంచంలోకి ఒక మోడల్‌గా అడుగుపెట్టిన దీపికా పదుకొనె నేడు వెండితెరను ఏలుతున్నస్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. తాను నటించిన పలు చిత్రాల ద్వారా ఒక విజయవంతమైన నటిగా నిరూపించుకున్న దీపికా తాను నటించే చిత్రాలలోనూ, బయట కూడా ఈమె ధరించే దుస్తులు ఎంతో ఆకర్షణీయంగా, ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈమె వస్త్రధారణ పలు సందర్భాల్లో అనేక మంది డిజైనర్ల ప్రశంసలకు పాత్రమయింది. అదే నమ్మకంతో ఈ 'చెన్నై ఎక్సప్రెస్ ' భామప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనర్‌గా అవతారమెత్తింది.

  అంతర్జాతీయంగా ఫ్యాషన్‌ దుస్తులను రూపొందించే కంపెనీ వాన్‌ హ్యుయుసెన్‌తో కలిసి తన డిజైనర్‌ దుస్తులను 'ఉమెన్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ కలక్షన్‌' పేరుతో విడుదల చేసింది. పాత హాలీవుడ్‌ గ్లామర్‌ దుస్తులను దృష్టిలో పెట్టుకుని ఈమె డిజైనర్‌ చేసిన దుస్తుల్లో మోనోక్రోమాటిక్‌ షేడ్స్‌, డస్టీ రోజ్‌ పింక్‌, కోబాల్ట్‌ బ్లూ రంగులు ముఖ్యమైనవి. డిజైన్లు పురాతనమైనవయినా సంప్రదాయబద్ధంగా, సమకాలీన ఫ్యాషన్లకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నానని అంటుంది దీపికా.

  ఇలా దుస్తుల డిజైన్‌ రంగంలో అడుగుపెట్టానని తానేమీ పెద్ద డిజైనర్‌ని కాదని, తాను నటిని అయినందున కెరియర్‌పరంగా ప్రతి రోజూ గ్లామర్‌ ప్రపంచంలో ఉంటాను కాబట్టి ఎవరికి ఎలాంటి దుస్తులు బాగా నప్పుతాయో అన్న అవగాహన సహజంగానే అబ్బుతుందని చెప్తుందీ కన్నడ కస్తూరి. అతివల అందాలను ద్విగుణీకృతం చేసే దుస్తులకు ఆలోచనలైతే ఉన్నాయి కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి తనకున్న పరిజ్ఞానం సరిపోనందున ఈ రంగంలో ఉన్న వాన్‌ హ్యుయుసెన్‌ సహాయాన్ని తీసుకున్నానన్నారు. ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో వారు ధరించే దుస్తులు ఎంతో ఉపయోగపడతాయని, ఆ హుందాతనం తాను రూపొంచిందించిన దుస్తుల డిజైన్లలో ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకున్నానని అంటుంది దీపిక.

  ఇక తన తాజా సినిమా 'రామ్ లీలా' ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనెకు అహ్మదాబాద్‌లో జరిగిన గార్బా ఈవెంటులో పాల్గొనడానికి వెళ్లి... ఊహించని సంఘటన ఎదుర్కొంది. గుజరాతీ అభిమానులను నుంచి తనకు సాదర స్వాగతం అభిస్తుందని భావించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెపై కోడిగుడ్లు, టమోటాలతో కొందరు దాడికి ప్రయత్నించారు. ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం....కొంత మంది ఆందోళనకారులు అహ్మదాబాద్‌‌లో జరిగిన గార్భా ఈవెంటు వద్దకు వచ్చి ఆమెపై దాడికి ప్రయత్నించారు. దీపిక నటించిన 'రామ్ లీలా' చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో వాటిని తొలగించాలని ఆందోళన కారులు డిమాండ్ చేసారు.

  English summary
  Deepika Padukone is the ultimate fashion icon today. Certainly not the one who believes in dressing for others, the leggy lass knows her style just so well. She rarely goes wrong with her clothing, and always slips into what complements her tall, slim frame.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more