»   » అవును..ఆ స్టార్ హీరోయినే...మోడలింగ్ రోజుల్లో అలా ఉండేది (ఫొటోలు)

అవును..ఆ స్టార్ హీరోయినే...మోడలింగ్ రోజుల్లో అలా ఉండేది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మీరు ఎప్పుడైనా గమనించారా. మన స్టార్ హీరోయిన్స్ (తెలుగు కాదండోయ్) ప్రారంభం రోజుల్లో మోడలింగ్ చేసి , కెమెరాకు , గ్లామర్ కు అలవాటు పడే ఆ తర్వాత సినిమాల్లోకి వస్తూంటారు. అలాగే మోడలింగ్ చేసేటప్పుడే ఓ రేంజిలో ఎక్సపోజింగ్ చేయటం మొదలైపోతుంది.

దాంతో సినిమాల్లో కు వచ్చినా నో రిస్ట్రిక్షన్స్ అన్నట్లుగా చెలరేగిపోతూంటారు. మోడలింగ్ నుంచి వచ్చిన వాళ్లకు ఆ బెనిఫిట్ ఉంటుంది. అందుకేనేమో కొత్త ఫేస్ కావాలనుకున్నప్పుడల్లా మన దర్శకులు,నిర్మాతలు మోడల్స్ వైపు చూస్తూంటారు. అందానికి అందం, సెక్సీనెస్ సెక్సీ, మొహమాటం లేని గ్లామర్ ప్రదర్శన.

అందుకే చాలా మంది హీరోయిన్స్ మోడలింగ్ డేస్ ఫొటోలు చూస్తే మనం ఆశ్చర్యంపోతాం. అరే ఇప్పుడు ఇంత పద్దతిగా కనపడే వీళ్లు అప్పట్లో అంత హాట్ గా ఎలా రెచ్చిపోయారో అనిపిస్తుంది. అలా ...మోడలింగ్ తో కెరీర్ మొదలెట్టి..బాలీవుడ్ లో టాప్ స్దాయికి వెళ్లి, హాలీవుడ్ లో సైతం పాగా వేస్తున్న దీపిక పదుకోని కొన్ని మోడలింగ్ డేస్ నాటి ఫొటోలు చూపెడతాం. చూసి ఎంజాయ్ చెయ్యండి.

అంత చిన్నవయస్సుకే

అంత చిన్నవయస్సుకే

దీపిక పదుకోని 18 సంవత్సరాల వయస్సుకే మోడలింగ్ ఫీల్డ్ లోకి వచ్చేసింది. అప్పుడే ఆమె కెమెరా ముందు హాట్ గా అందాలు ఆరబోసింది. అప్పటి దీపికకు ఇప్పటికి దీపికకు ఏం తేడా ఉందో గమనించండి మరి. అప్పట్లో...అదరకొట్టింది కదూ.

 సహజమైన అందం

సహజమైన అందం

దీపిక పదుకోనిది నాచురల్ బ్యూటి అనిపిస్తుంది ఈ ఫొటోలు చూస్తూంటే. ఆమె అప్పట్లోనే చాలా బాగుండేది. ఆమె లేకఫేస్, బాడీలో టీనేజ్ అందాలు తొంగి చూస్తున్నాయి కదూ. మరి వాటితోనే కదా ఆమె మోడలింగ్ రంగాన్ని ఏలింది.

కెరీర్ విషయంలో క్లారిటీ

కెరీర్ విషయంలో క్లారిటీ

దీపిక పదుకోని తాను ఈ రోజు ఈ స్దాయిలో ఉండటానికి కారణం కేవలం కెరీర్ విషయంలో కన్ఫూజన్ లేకపోవటమే అంటారు. నేషనల్ లెవిల్ బాడ్ మెంటెన్ ప్లేయిర్ అయిన ఆమె ఇలా గ్లామర్ పీల్డ్ కు రావాలని నిర్ణయించుకుని ఆ కెరీర్ బిల్డప్ లో భాగంగానే మొడలింగ్ వైపు వచ్చానంటారు.

సక్సెస్ ఫుల్ మోడల్

సక్సెస్ ఫుల్ మోడల్

ఇప్పుడెలా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యిందో ..అదే విధంగా ఆ రోజుల్లోనూ దీపిక సక్సెస్ ఫుల్ మోడల్ గా వెలిగింది. ఆమె కష్టం, తీసుకునే జాగ్రత్తలు, కెరీర్ ప్లానింగ్ ఆమెకు మోడలింగ్ లోనూ టాప్ స్దాయికి తీసుకువెళ్లాయి. అదే స్టాటజీని ఇప్పటికీ ఆమె అమలు చేస్తోంది.

 హిమేష్ రేష్మియా మొదటి సారిగా

హిమేష్ రేష్మియా మొదటి సారిగా

దీపికపదుకోని మోడల్ గా చేసేటప్పుడు ఓ ర్యాంప్ వాక్ లో ఆమెను చూసి, ఆమె టాప్ స్టార్ అవుతుందని భావించి, తను చేస్తున్న నామ్ హై తేరా తేరాలో ఆపర్ ఇచ్చారు. అయితే ఈ విషయం దీపిక ఎప్పుడూ ప్రస్దావించదు అనుకోండి. కానీ ఆ ఆఫరే ఆమెకు మోరల్ సపోర్ట్ లాంటిది.

 ఆ సాంగ్ బాగుంటుంది

ఆ సాంగ్ బాగుంటుంది

తనకు నిజానికి ఓ సాంగ్ ఆల్బమ్ లో చెయ్యాలని అసలు లేదట. కానీ హిమ్మేష్ పట్టుపట్టి చేయించారంటుంది. అలాగని సాంగ్ కి వంక పెట్టలేం. సాంగ్ చాలా బాగుంది అని కితాబు ఇస్తుంది. అంటే హీరోయిన్ ట్రైల్స్ ఉన్న అప్పుడు ఈ సాంగ్ ఆల్బమ్స్ ఎందుకు అని బావించిందిట.

 ఆమె చూడబట్టే కెరీర్ లో మలుపు

ఆమె చూడబట్టే కెరీర్ లో మలుపు

బాలీవుడ్ దర్శకురాలు ఫరాఖాన్ తనను చూడబట్టే తనకు షారూఖ్ సరసన ఛాన్స్ వచ్చిందని చెప్తోంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్‌వన్ ఎవరూ అంటే అందరూ దీపికా పదుకొనె అని చెబుతున్నారు అందుకు కారణం ఫరాఖాన్ కళ్ళల్లో పడటమే. పెద్ద కష్టం లేకుండానే దీపిక టాప్ పొజిషన్‌కు వెళ్లిందనే చెప్పాలి. ‘ఓం శాంతి ఓం' చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు యూత్ గుండెలను పట్టేసింది.

 లక్ కూడా కలిసొచ్చింది

లక్ కూడా కలిసొచ్చింది

తనకన్నా అందగత్తెలు ఉండవచ్చు. నటీమణులు కూడా ఉన్నారు. కానీ ఆ సమయానికి ఫరాఖాన్ కు కళ్లల్లో పడటం, వాళ్లు కొత్త హీరోయిన్ ని లాంచ్ చెయ్యాలనుకోవటం, షారూఖ్ సైతం ఓకే చేయటం, అంతా నా అదృష్టమే. టైమ్ కలిసొచ్చిందనే చెప్పాలి.

 చాలా నేర్పించాము కాబట్టే

చాలా నేర్పించాము కాబట్టే

దర్శకురాలు ఫరాఖాన్ ఆమెను లాంచ్ చేయటానికి పెద్దగా ఆలోచించలేదని, తను ఒకటి నమ్మానని, అది శాంతిప్రియ అనే పాత్రకు దీపిక న్యాయం చేస్తుందని, అదే నిజమైందని చెప్తారు. అలాగే..బేసిక్ యాక్టింగ్ స్కిల్స్, క్లాసికల్ డాన్స్ నేర్పించటం కూడా ప్లస్ అయ్యిందని అంటారామె.

షారూఖ్ తో కెమిస్ట్రీ వర్కవుట్

షారూఖ్ తో కెమిస్ట్రీ వర్కవుట్

తొలి చిత్రం తను బెరుకుగా చేసినా షారూఖ్ తో తన కెమిస్ట్రీ వర్కవుట్ అవటమే సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్తోంది. దర్శకురాలు ఏదైతో ఊహించిందో అది పదే పదే తెలుసుకుని, ఆ పాత్రలోకి తను వెళ్ళటానికి ప్రయత్నించానని ఆమె వివరిస్తుంది.

English summary
Miss Deepika Padukone was only 18 when she started modelling and even in those days she looked as hot as she looks today. Check it yourself to believe what we are saying!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu