»   » కావాలంటే నా కాలు తీసుకోండి.., అప్పట్లో చెంప చెళ్లుమనిపించా: దీపికా పదుకొణే

కావాలంటే నా కాలు తీసుకోండి.., అప్పట్లో చెంప చెళ్లుమనిపించా: దీపికా పదుకొణే

Subscribe to Filmibeat Telugu

షూటింగ్ నుంచే వివాదాల్లో ఇరుక్కుని.. తీవ్ర ఆందోళనల నడుమ ఎట్టకేలకు విడుదలైన సినిమా 'పద్మావత్'. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది. అటు విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది. సినిమా వివాదాలపై తొలి నుంచి అంతగా స్పందించని దీపికా పదుకొణే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎట్టకేలకు స్పందించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

'పద్మావత్'పై మొట్టమొదటి రివ్యూ..!
కావాలంటే నా కాలు తీసుకోండి..

కావాలంటే నా కాలు తీసుకోండి..


అవును.. 'పద్మావత్'లో నటించినందుకు నా తల, ముక్కు నరికినవాళ్లను డబ్బు ఇస్తామని కొంతమంది బెదిరించారు. నాకు నా ముక్కు అంటే చాలా ఇష్టం. నా కాళ్లు చాలా పొడవుగా ఉంటాయి. కావాలంటే వాటిని తీసుకోండి.

చెంప చెళ్లుమనిపించా:

చెంప చెళ్లుమనిపించా:

ఇలాంటి బెదిరింపులను తేలిగ్గా తీసుకోకూడదు. నా చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది. 14 ఏళ్ల వయసులో ఒకసారి మ్మానాన్నలతో కలిసి బయటికి వెళ్లాను. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నన్ను తోసుకుంటూ వెళ్లాడు. నేను చూస్తూ ఊరుకోలేదు. వెళ్లి అతని చొక్కా పట్టుకుని చెంప చెళ్లుమనిపించా.

'పద్మావత్' పాత్రపై:

'పద్మావత్' పాత్రపై:

రాణి పద్మిని ధైర్యం, ఆమె దర్పం గురించి సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారు. ఈతరం అమ్మాయిలు ఆమె నుంచి చాలా నేర్చుకోవాలి.

'పద్మావత్' కష్టంగా అనిపించింది..:

'పద్మావత్' కష్టంగా అనిపించింది..:

'పద్మావత్' పాత్ర గురించి చాలా చెప్పుకోవాలి. కానీ మాటలతో కాదు.. మౌనంతోనే. మౌనంతోనే రాణి వ్యక్తిత్వం గురించి వివరించాలి. చేతిలో ఖడ్గం లేకపోయినా పోరాడగలిగే వీర వనిత ఆమె. అందుకే ఆ పాత్రలో నటించడం నాకు చాలా కష్టంగా అనిపించింది.

సప్నా దీదీ..:

సప్నా దీదీ..:

ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో 'సప్నా దీదీ' అనే బయోపిక్ కమిట్ అయ్యారు దీపికా. ఇందులో ఇర్ఫాన్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ముంబయిలోని నాగ్‌పాడాకు చెందిన మాఫియా క్వీన్‌ రహీమా ఖాన్‌ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

English summary
Deepika Padukone reacted on threats to chop off her nose. In an interview Deepika said that she loves her nose very much, if they wants take my leg.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu