»   » సినిమా విడుదల ఆపాలంటూ కోర్టు స్టే

సినిమా విడుదల ఆపాలంటూ కోర్టు స్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: మాధురి దీక్షిత్‌, జుహీ చావ్లా నటించిన 'గులాబ్‌ గ్యాంగ్‌' సినిమా విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ సినిమాను తన బృందం 'గులాబీగ్యాంగ్‌' ఆధారంగా నిర్మించారంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సంపత్‌పాల్‌దేవి కోర్టునాశ్రయిచడంతో నిలుపుదల ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచా రణ తేదీ మే 8 వరకు సినిమా విడుదల ఆపేయాలని న్యాయ మూర్తి జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌ ఆదేశిం చారు. దాంతో ఈనెల 7వతేదీన విడుదలకానున్న ఈ చిత్రం రిలీజ్ ఆగింది.

గులాబ్ గ్యాంగ్ చిత్రం ద్వారా సౌమిక్ సేన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలో మాధురి దీక్షిత్ పల్లెటూరి మహిళగా డీగ్లామరస్ పాత్ర పోషిస్తోంది. గులాబ్ గ్యాంగ్‌కు ఆమెనే నాయకురాలిగా కనిపించబోతోంది. మాధురిలో ఈ చిత్రంలో చేసే యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజిలో ఉండనున్నాయి. మరో విశేషం ఏమిటంటో ఈచిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ జుహి చావ్లా కూడా నటిస్తోంది.

Delhi High Court stays release of Madhuri Dixit's 'Gulaab Gang'

ఇక 'గులాబీ గ్యాంగ్' సినిమా కోసం మాధురి పాత్ర ఫైటింగ్స్ చేయాల్సిన అసవరం ఉండటంతో ఆమె రంగంలోకి దిగాల్సి వచ్చింది. మాధురి దీక్షిత్ కుంగ్‌ఫూ, కరాటే నేర్చుకుని మరీ ఫైటింగ్‌కు సై అంటోంది. అందం, డ్యాన్స్‌లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయగల క్రేజ్‌ను సొంతం చేసుకున్న నటి. 'ఆజా నాచ్ లే' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మాధురి దీక్షిత్ 'యే జవానీ హై దివానీ' సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నూ కనిపించింది.

ప్రస్తుతం 'గులాబీగ్యాంగ్' అనే ఈ భారీ చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్రంలోని తన పాత్ర డేర్‌డెవిల్‌గా ఉంటుందట. విలన్‌తో పోరాట సన్నివేశాలుంటాయట. దాంతో రెండు నెలలుగా మాధురీ దీక్షిత్ కుంగ్‌ఫూ, కరాటే నేర్చుకునే పనిలో బిజీగా ఉంది. షూటింగ్ అయిపోగానే నేరుగా శిక్షణ సెంటర్‌కే వెళ్లిపోతుందట. డ్యాన్స్‌లోనే కాదు యాక్షన్‌లోనూ తనను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా చెబుతోంది. ఈ లేటు వయసులో మాధరి దీక్షిత్ చేస్తున్న పోరాటాల గురించి తెలియాలంటే సినిమా వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే.

మరో ప్రక్క'గులాబ్‌గ్యాంగ్' సినిమాకు ప్రేరణగా నిలిచిన నిజమైన గులాబీగ్యాంగ్‌లో విభేదాలు బట్టబయలవ్వటమే కాదు ఈ మహిళాదండు ప్రత్యక్షరాజకీయ దిశగా అడుగులు వేస్తోంది. మాధురీదీక్షిత్, జూహీచావ్లా నటించిన ఈ సినిమా కోసం దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అసలు ఈ మహిళాదండును ఏర్పాటుచేసిన సంపత్‌పాల్ దేవినే ఈ దండు నుంచి బయటకు వెళ్లిగొట్టారు. ఈ దండు రెండు విభాలుగా చీలిపోయింది.

మహిళా సాధికారితే ధ్యేయంగా ఏర్పాటైన ఈ సామాజిక ఉద్యమం నేడు రాజకీయ రంగు పులుముకొని తన లక్ష్యాన్ని విడనాడుతుందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బుందేల్‌ఖండ్‌లోని అట్టారాలో జరిగిన జనరల్‌బాడీ సమావేశంలో సంపత్‌పాల్ (51)కు వ్యతిరేకంగా చేతులెత్తి నిరసన తెలియజేయటమే కాకుండా ఆమెను బయటకు పంపిస్తూ కొత్త కమాండర్‌గా సుమన్‌సింగ్‌ను ఎంపికచేసుకోవటం గమనార్హం.

English summary

 The Delhi High Court Wednesday stayed the release of forthcoming Hindi movie 'Gulaab Gang', reportedly based on the life of activist Sampat Pal, who formed Gulabi Gang, a group of pink sari clad women vigilantes in Uttar Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu