twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ‘విక్రమ్ సింహా’కాస్ట్యూమ్స్‌పై నీతాలుల్లా

    By Srikanya
    |

    ముంబై: ఇప్పుడు ఎక్కడ విన్నా విక్రమ్ సింహా కబుర్లే. రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కావటంతో అంతటా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇండియాలో మొట్టమొదటి ఫొటో రియాలిస్టిక్‌ ఫర్‌ఫామెన్స్‌ క్యాప్చర్‌ సినిమాకు డిజైనర్‌గా పనిచేయడం తన కెరీర్‌లో ఒక మైలురాయిగా అభివర్ణించారు ప్రముఖ డిజైనర్‌ నీతాలుల్లా. జాతీయ స్థాయిలో ఉత్తమ ఫ్యాషన్‌ డిజైనర్‌గా అవార్డు అందుకున్న నీతాలుల్లా తన అనుభవాలను వెల్లడించారు. మూడు పర్యాయాలు రజనీకాంత్‌ సినిమాలకు డిజైనర్‌గా పనిచేయడం తన జీవితాన్ని ఒక మలుపు తిప్పిందన్నారు.

    కొచ్చాడియన్‌ (విక్రమ్ సింహా) చిత్రానికి కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా పని చేయటం గొప్ప అనుభూతని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం తన జీవితాంతం గుర్తుండిపోతుందని వెల్లడించారు. తాను ఇప్పటి వరకు పనిచేసిన ప్రాజెక్టుల్లో ఇది చాలా గొప్పదని తెలిపారు. కాస్ట్యూమ్స్‌ తయారు చేసేందుకు తొలుత తాను పాత్రలను స్కెచ్‌ గీశానని, జువెలరీ అందంగా కన్పించేందుకు ఎన్నో పరిశోధనలు చేశానని ఆమె తన అనుభవాలన్నీ పంచుకున్నారు.

    Designing for Rajinikanth is milestone in my career: Neeta Lulla

    మొదట సినిమా స్క్రిప్ట్‌ను బాగా అధ్యయనం చేశానని, అందులోని పాత్రలకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ రూపొందించేందుకు స్కెచింగ్‌, రీస్కెచింగ్‌ కోసం దాదాపు 6-8 నెలలు కష్టపడాల్సి వచ్చిందని నీతాలుల్లా వెల్లడించారు. ప్రతి పాత్రకు 150 కాస్ట్యూమ్స్‌ను పేపర్‌పై రూపొందించానని, వీటిల్లో ఒక్కొక్కరికి 20-25 కాస్ట్యూమ్స్‌ ఎంపిక చేశానని పేర్కొన్నారు. ప్రతి ఎంబ్రాయిడరీ ప్యాటరన్‌ను ఫొటో తీసి దుస్తులపై సక్రమంగా అమర్చి తుదిరూపునిచ్చామని, ఈ ప్రక్రియలో పేపర్‌పై వర్క్‌ చేయడం, సాంకేతిక నిపుణులు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేనన్నారు.

    క్యాస్ట్యూమ్స్‌ పని ప్రారంభించేందుకు ముందు తాను రెండు పర్యాయాలు వర్క్‌షాప్‌కు హాజరయ్యానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకసారి చెన్నై, మరోసారి చైనా వెళ్లినట్లు తెలిపారు. గతంలో తాను శివాజీ, రాణా సినిమాలకు కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా పనిచేశానని, రజనీకాంత్‌తో కలిసి పని చేయడం గొప్ప అనుభూతని లుల్లా పేర్కొన్నారు.

    రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా 'కోచ్చడయాన్‌'. దీపిక పదుకొనె హీరోయిన్ . ఆది పినిశెట్టి ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. రజనీకాంత్‌ తనయురాలు సౌందర్య ఆర్‌.అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే లండన్‌లో విజువల్‌ ఎఫెక్ట్‌‌స వర్క్‌ పూర్తి చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని లక్ష్మి గణపతి ఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. తమిళ్‌, హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శోభన, శరత్‌కుమార్‌, జాకీ ష్రాప్‌, నాజర్‌ ..ఇలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ విభిన్న అవతారంలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులు సహా ప్రేక్షకుల్లో వైబ్రేషన్‌ క్రియేట్‌ చేశాయి.

    English summary
    Rajinikanth’s film, Kochadaiyaan, is being touted as a magnum opus for many reasons. Along with a big budget and lavish sets, the movie also boasts of intricate and detailed costumes. Neeta Lulla, who has designed the outfits for the movie, says that she “created 150 costumes per character on paper”. “Finally, 20-25 were selected and then detailed for each character,” she says, adding, “Due to the intricacy, each embroidered pattern needed to be photographed and placed carefully.” 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X