For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాక్కూడా తనంటే చాలా ఇష్టం: పవన్‌ కళ్యాణ్

  By Srikanya
  |

  హైదరాబాద్ :''శ్రీకాంత్‌ మంచి నటుడే కాదు... మంచి మనిషి కూడా. శ్రీకాంత్ అంటే అన్నయ్యకు చాలా ఇష్టం. నాక్కూడా తనంటే చాలా ఇష్టం. ఒకసారి తను మా ఇంటికొచ్చినప్పుడు 'నా ఇంకో తమ్ముడు' అంటూ శ్రీకాంత్‌ను నాకు పరిచయం చేశాడు అన్నయ్య. 'దేవరాయ' ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి'' అన్నారు పవన్‌ కళ్యాణ్. నానిగాడి సినిమా సమర్పణలో శ్రీకాంత్ హీరోగా నానికృష్ణ దర్శకత్వంలో సన్‌రే ఇంటర్నేషనల్ సినిమా పతాకంపై కిరణ్ జక్కంశెట్టి, నానికృష్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'దేవరాయ'.

  బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'దేవరాయ' ఆడియో పంక్షన్ కి పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి సీడీని ఆవిష్కరించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు స్వీకరించారు. శ్రీకాంత్‌ హీరోగా నటించిన చిత్రం 'దేవరాయ'. విదిశ, మీనాక్షి దీక్షిత్‌ కథానాయికలు. నానికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు . చక్రి సంగీత దర్శకుడు. పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ''ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయి. ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు శ్రీకాంత్‌ వచ్చి ఆడియో వేడుకకు రావాలని అడిగారు. తనపై ఉన్న అభిమానంతో వచ్చాను'' అన్నారు.

  శ్రీకాంత్ మాట్లాడుతూ- ''నాకు అన్నయ్యతోను, వాళ్ల కుటుంబ సభ్యులతోనూ ఎలాంటి అనుబంధం ఉందో అందరికీ తెలిసిందే. కళ్యాణ్‌తో నా పరిచయం అన్నయ్య అంత కాదు. కళ్యాణ్ లెక్కే వేరు. తన పని తను చేసుకు వెళ్లిపోతాడు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోడు. మామూలుగా తను ఫంక్షన్స్‌కి రాడు. అందుకని వస్తాడో రాడోనని సందేహంగా అడిగాను. అడగ్గానే వెంటనే ఓకే అన్నాడు. తన సినిమాకి వేడుక చేస్తామన్నా ఒప్పుకోరు. మరి నేనడిగితే వస్తారా? అనే సందేహంతోనే వెళ్లాను. అడిగిన వెంటనే ఒప్పుకొన్నారు. ఒక మంచి సినిమాకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో పవన్‌ వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మా కుటుంబం కర్ణాటకలో ఉండేది. నా చిన్నతనంలో హంపీకి సైకిల్‌ మీద వెళ్లేవాణ్ని. అక్కడి చారిత్రక ప్రదేశాల్లో తిరిగేవాణ్ని. ఇప్పుడు రాయలవారిగా నటించడం విచిత్రమనిపిస్తోంది'' అన్నారు.

  దర్శకుడు నానికృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమాకి చక్రి చక్కటి స్వరాలు సమకూర్చారు. సినిమా వినోద ప్రధానంగా ఉంటుంది''అన్నారు. ''పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా పాటలు విడుదల కావడం సంతోషంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయలుగా శ్రీకాంత్‌ చక్కగా సరిపోయారు''అని చక్రి చెప్పారు. ఈ వేడుకలో ఇంకా శాసనసభ్యుడు కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు వి.సాగర్, పి.కిరణ్, టి.ప్రసన్నకుమార్, సీఆర్ మనోహర్, అనిల్, రమేష్ పుప్పాల, శివాజీరాజా, శాన్వి తదితర చిత్రరంగ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఇంకా 'దేవరాయ' యూనిట్ సభ్యుల్లో చక్రి, కిరణ్ జక్కంశెట్టి, నానికృష్ణ, విదీషా, మీనాక్షిదీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

  English summary
  The audio songs of Srikanth’s upcoming socio-fantasy film Devaraya has been launched September 12 amid great fanfare. The event graced the occasion with a special guest Pawan Kalyan. Power star unveiled the audio albums while minister Ganta Srinivas Rao, Tammareddy was the other chief guests for the audio release ceremony.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X