»   » తన తండ్రి కోసం.. దేవిశ్రీ స్పెషల్ సాంగ్

తన తండ్రి కోసం.. దేవిశ్రీ స్పెషల్ సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తండ్రి, ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి ఇటీవల కన్నమూసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ని గుర్తు చేసుకుంటూ...దేవిశ్రీ తన తండ్రి కోసం ఓ పాటను రచించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఈ పాటను ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ముగింపులో ఉంచామని, ఇదీ చిత్రానికి సంబంధించినదే అని వివరించారు. తండ్రి-కుమారుడు, తండ్రి-కుమార్తెకు మధ్య ఉన్న అనుబంధాన్ని వర్ణిస్తూ పాట రాసినట్లు తెలిపారు.

ఈ పాటను తండ్రులందరికీ అంకితం చేస్తున్నానన్నారు. త్వరలో పాటను విడిగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.

ఇక తన తండ్రి మృతి గురించి ఎన్టీఆర్ ఇంటర్వూలో ఎమోషన్ ల్ గా చెప్పిన మాటల వీడియోని సైతం ఆయన షేర్ చేసారు. ఆ వీడియోని మీరూ ఇక్కడ చూడండి.

చిత్రం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ...నాన్నపై అత్యంత ప్రేమ ఉన్న ఏడెనిమిది మంది కలసి తీసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌కీ వాళ్ల నాన్నంటే చెప్పలేనంత అభిమానం. అందుకోసమే చాలా కసిగా చేసాడు ఈ సినిమాను. ఈ సినిమాకు ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సుకుమార్‌ సినిమాలు గుర్తుకొచ్చాయి. సినిమా చివర్లో అమ్మానాన్నలకి ప్రేమతో అని రాస్తుంటారు. అది గుర్తుకొచ్చి ‘నాన్నకు ప్రేమతో అని పెడితే ఎలా ఉంటుంది సర్‌' అన్నా. ‘చాలా బాగుంటుంది, ఇదే పెట్టేద్దాం' అన్నారాయన.

Devi composes special song for his father

నాన్నకు ప్రేమతో' అనే పేరు తట్టడం కూడా ఈ కథ గొప్పదనమే. ఈ సినిమాలో ‘అందరూ టైమ్‌ని సెకండ్లలోనూ, నిమిషాల్లోనూ కొలుస్తారు. కానీ నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తుంటా' అనే డైలాగ్‌ ఉంది. ఆ డైలాగ్‌ నుంచి పుట్టిందే సినిమా లోగోకు మధ్యలో ఉన్న గుండె చప్పుడు గుర్తు. అది నేను సూచించిందే అని సుకుమార్‌గారు చెప్పడం ఆయన గొప్పతనం. కానీ నాకు ఆయన చెప్పిన డైలాగ్‌తోనే ఆ చిహ్నం గుర్తుకొచ్చింది'' అని చెప్పుకొచ్చారు.

మరో ప్రక్క.. ఈ చిత్రం ఇప్పుడు సౌత్ ఇండియా లో తప్ప మిగతా ప్రాంతాలన్నిటిలోనూ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ విడుదల అవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం భాష రాని వారిని కూడా రీచ్ అవుతుంది. ఎక్కువ ప్రాంతాల్లో విడుదల చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటంతో ఎక్కువ రెవిన్యూ జనరేట్ అయ్యే అవకాసం ఉంది.

English summary
Devi Prasad tweeted that in Nanakku Prematho we will get to see a song he wrote for his father as the credits roll.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu