»   » హాట్ హీరోయిన్లతో దేవిశ్రీ ప్రసాద్ (ఫోటో)

హాట్ హీరోయిన్లతో దేవిశ్రీ ప్రసాద్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్....ట్విట్టర్లో పోస్టు చేసిన ఫోటో చర్చనీయాంశం అయింది. ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్, తమన్నా, వేదిక, ఆండ్రియాలతో కూడిన ఈ ఫోటోకు Devi(L)'s Angels అనే క్యాప్షన్ ఇచ్చారు. హీరోయిన్లతో దేవిశ్రీ ఎంత క్లోజ్ రిలేషన్స్ మెయింటేన్ చేస్తారో ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

కంటిన్యూ హిట్స్ తో మ్యూజిక్ డైరక్టర్ గా ఒక వెలుగు వెలిగుతున్న తెలుగు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. స్టేజీపై అతను ఉషారుగా చేసే డాన్స్‌లు అవీ చూసి అతన్ని హీరోగా చేయాలని పలువురు నిర్మాతలు, దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Devi Sri Prasad

అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేస్తారు అంటే సుకుమార్ చేసే అవకాసం ఉందని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇది రూమరా లేక నిజంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది తేలాల్సి ఉంది. ఇక యూత్ సబ్జెక్ట్స్‌ని డీల్ చేయటంలో సుకుమార్‌ది అందె వేసిన చేయి. దానికి తోడు దేవికి, సుకుమార్ కు మధ్య మంచి రిలేషన్ ఉంది. సుకుమార్ సినిమాలన్నిటికి దేవినే మ్యూజిక్ డైరక్టర్. కెరీర్ మొదటి నుంచి దేవి‌తో సుకుమార్ ప్రయాణం సాగుతోంది.

సుకుమార్ పూనుకుని దేవిని హీరో చేద్దామని ఫిక్స్ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. అలాగే తన మొదటి సినిమా ఓ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఉండాలని దేవి బావిస్తున్నట్లు తెలుస్తోంది. తంలో దేవి మీడియాతో మాట్లాడుతూ... నేను హీరోగా నటిస్తాననీ వార్తలు వస్తూనే ఉన్నాయి. చేయాలని ఉంది. కానీ కథ నచ్చాలి. అది నన్ను వెంటాడాలి. అలాంటప్పుడు నటించడానికేం అభ్యంతరం లేదు అన్నారు.

English summary

 Tollywood music director Devi Sri Prasad posted this photograph of Twitter, with the caption Devi(L)’s Angels. You can see noted singer Shreyash Ghoshal, actresses Tamannah, Vedhika and Andrea in the photograph.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu