»   » జూ ఎన్టీఆర్‌‌పై దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్: విమర్శలు, పొగడ్తలు!

జూ ఎన్టీఆర్‌‌పై దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్: విమర్శలు, పొగడ్తలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళనాడులో రజనీకాంత్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌతిండియా సినీ పరిశ్రమలో రజనీ ఒక సంచలనం. తమిళ అభిమానులంతా ఆయన్ను ముద్దుగా ‘తలైవా' అని పిలుస్తుంటారు. సౌత్ లో ‘తలైవా' అంటే ఎవరు అంటే రజనీకాంతే అని ఇట్టే చెప్పేస్తారు.

అయితే ఇటీవల జరిగినప ‘కుమారి 21 ఎఫ్' టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్ చేసారు దేవిశ్రీ ప్రసాద్. ఎన్టీఆర్ ‘తెలుగు తలైవా' అంటూ కామెంట్ చేసారు. రజనీకాంత్ తో జూ ఎన్టీఆర్ ను పోల్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది.

రజనీకాంత్ తో ఎన్టీఆర్ ను పోల్చడంపై కొందరు విమర్శలకు దిగుతుంటే... మరికొందరు మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ రేంజి తమిళంలో రజనీకాంత్ రేంజికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని అభిమానులు పొగడ్తలు గుప్పిస్తున్నారు.

Devi Sri Prasad says NTR Thalaiva in Tollywood

ఎన్టీఆర్ తాజా సినిమా ‘నాన్నకు ప్రేమతో' విషయానికొస్తే...
సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. . ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... ఇటీవల లండన్‌లో భారీ షెడ్యూల్ జరిపామనీ, తదుపరి షెడ్యూల్‌ను అక్టోబర్ 20న మొదలుపెడతామని బీవీయస్‌యన్ ప్రసాద్ తెలిపారు. స్పెయిన్‌లో జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో ఈ పాత్రలో ఒదిగిపోయారని ఆయన తెలిపారు.

ఇప్పటివరకూ ఆయన నటించిన 24 చిత్రాల్లోని లుక్స్‌కి పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్‌గా ఎన్టీఆర్ కనిపించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వినాయిక చవితి సందర్బంగా ఎన్టీఆర్‌ తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతా ద్వారా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

English summary
Devi Sri Prasad says NTR Thalaiva in Tollywood.
Please Wait while comments are loading...