»   » కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తిన దేవిశ్రీ ప్రసాద్

కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తిన దేవిశ్రీ ప్రసాద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్‌లో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. కేవలం మ్యూజిక్ కంపోజ్ చేయడం, పాటలు పాడటమే కాదు.... స్టేజీ ఎక్కితే రాక్ స్టార్‌కు ఏ మాత్రం తీసి పోకుండా పాటలు పాడుతూ ఫుల్ ఎనర్జీతో డాన్స్ చేయడం టాలీవుడ్లో ఒక్క దేవిశ్రీ ప్రసాద్‌కే చెల్లింది. పలు ఆడియో వేడుకల్లో దేవిశ్రీ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేవిశ్రీ ప్రసాద్ కొరియోగ్రాఫర్ గా మారినట్లు సమాచారం. ‘కుమారి 21ఎఫ్' సినిమాకు ఆయన తనదైన స్టైల్‌లో డాన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ డాన్స్ కంపోజ్ చేసిన సాంగ్ చాలా బాగా వచ్చిందని, దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారని సమాచారం.

 Devi Sri Prasad turns choreographer

సుకుమార్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్'. రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటిస్తున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు.

ఇటీవల ‘కుమారి 21 ఎఫ్' టీజర్ రిలీజ్ సందర్భంగా దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``రాజ్‌త‌రుణ్ నిజానికి అప్ క‌మింగ్ హీరో. ఈ సినిమాతో అత‌నికి త‌ప్ప‌కుండా మంచి బ్రేక్ వ‌స్తుంది. నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాడు. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంది. సుకుమార్‌, నేనూ క‌లిసి చేస్తామంటే త‌ప్ప‌కుండా క్రేజ్ ఉంటుంది. ఇది కూడా చాలా మంచి సినిమా అవుతుంది. ఎన్టీఆర్ ఈ చిన్న సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి రావ‌డం చాలా ఆనందంగా ఉంది. అది గొప్ప విష‌యం. క‌రెంటు సినిమాకు నేను ఈ ద‌ర్శ‌కుడితో ప‌నిచేశాను. ఆ పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి`` అని అన్నారు.

English summary
As per the latest reports, Devi Sri Prasad choreographed a song in Kumari 21F, the debut production of his close friend and longtime collaborator, Sukumar.
Please Wait while comments are loading...