»   » 'కంచె' గురించి దేవిశ్రీ ప్రసాద్‌ ఇలా

'కంచె' గురించి దేవిశ్రీ ప్రసాద్‌ ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: క్రిష్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌లు జంటగా నటించిన చిత్రం 'కంచె'. దసరా సందర్భంగా అక్టోబర్‌ 22న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ఖాతా ద్వారా సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

KANCHE - Amazingly Brilliant & Genuine Film!! Hats off to Director Krish for the Extraordinary Concept & Making!! Loved...

Posted by Devi Sri Prasad on 24 October 2015

ఇంత చక్కటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన క్రిష్‌కు అభినందనలు తెలిపారు. వరుణ్‌తేజ్‌ నటన చాలా బావుందంటూ... ఆయన మెచ్చుకుంటూ పోస్ట్‌ చేశారు. వరుణ్‌తేజ్‌, ప్రగ్యాజైశ్వాల్‌ జంటగా నటించిన చిత్రమిది. క్రిష్‌ దర్శకుడు.

Devisriprasad

''పల్లెటూరి వాతావరణాన్నీ, ప్రేమకథనీ ఎంత సహజంగా చెప్పారో... రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్నీ అదే తరహాలో హాలీవుడ్‌కి ధీటుగా 'కంచె'లో చూపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో 'కంచె' లాంటి సినిమా రూపుదిద్దుకోవడం గర్వకారణమ''న్నారు చిరంజీవి.


చిరంజీవి మాట్లాడుతూ ''కంచె... విజయవంతమైన ఓ మంచి ప్రయత్నం. దర్శకుడు చక్కటి కథ, కథనాలతో సినిమాని బాగా అల్లాడు. మా అబ్బాయి వరుణ్‌తేజ్‌ పాత్రలో ఒదిగిపోయిన తీరు నచ్చింది. 1936లోని కథానాయకుడిగానే కనిపించాడు. పల్లెటూరి సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. తండ్రిగా నేను గర్వపడుతున్నా. మాటల రచయిత సాయిమాధవ్‌ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించాలి.

Thank you very much Chiranjeevi garu. HONOURED!

Posted by Kanche on 25 October 2015

పుట్టినరోజు, కులాలు, మనస్పర్థల గురించి ఎంతో తాత్వికంగా సంభాషణలు రాశారాయన. ప్రతి సంభాషణ ఆలోచన రేకెత్తించేలా, చైతన్యం తీసుకొచ్చేలా ఉంది. యుద్ధం నేపథ్యంతో కూడిన ఈ సినిమాని కేవలం 55 రోజుల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా. 125, 150 రోజులు అంటూ సినిమాని తీసుకొంటూ వెళ్లిపోతున్న రోజులివి. ఇంత తక్కువ సమయంలో పూర్తి చేశారంటే నిజంగా ఈ సినిమా దర్శకుడి ప్రతిభకు గీటురాయి. క్రిష్‌ నుంచి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి''అన్నారు.

kanche

క్రిష్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాను అమ్మ, నాన్న, గురువు, దైవం, పుడమి, పుస్తకానికి అంకితమిచ్చా. నా తదుపరి సినిమాని ప్రేక్షకులకు అంకితమిస్తా. చిరంజీవిగారు ఇలా ఇంటికి పిలిచి అభినందించడం నా జీవితంలో ఓ తీపిగుర్తుగా నిలిచిపోతుంది''అన్నారు.

English summary
DEVI SRI PRASAD ‏tweeted: "#KANCHE-Evry technician Excelled! Cinematgrphy,Music,Dialogue, Editng,Mixng & Screenplay n Dirction DirKrish ! Awesme Casting! Must Watch👏"
Please Wait while comments are loading...