For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SIR: ధనుష్ తెలుగు సినిమాకు అదిరిపోయే టైటిల్.. యంగ్ డైరెక్టర్ సరికొత్త ప్రయోగం

  |

  తెలుగు సినీ పరిశ్రమలో కొంత కాలంగా భారీ చిత్రాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్ స్టామినా గురించి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో మన హీరోలతో సినిమాలు చేయడానికి పలు పరిశ్రమలకు చెందిన దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. అలాగే, మన దర్శకులతో సినిమాలు చేయడానికి వేరే ఇండస్ట్రీలకు చెందిన హీరోలు సైతం ముందుకొస్తున్నారు. దీనికి కారణం తెలుగు దర్శకుల్లో చాలా మంది పాన్ ఇండియా రేంజ్ వాళ్లే ఉన్నారు. అందుకే మన డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి వేరే హీరోలు క్యూ కడుతున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ఓకే అయిపోయాయి.

  Bigg Boss: శ్రీరామ చంద్ర పరిస్థితి దారుణం.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు.. అలా చేస్తే ప్రమాదమే

  అద్భుతమైన నటనతో జాతీయ అవార్డును దక్కించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనూష్‌ ఎప్పటి నుంచో తెలుగులో నేరుగా సినిమా చేయాలని ప్రయత్నాలు జరుపుతున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరొందిన శేఖర్ కమ్ములతో సినిమాను ప్రకటించాడు. కానీ, అది ఎందుకనో ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మొట్టమొదటి తెలుగు సినిమాను చేయబోతున్నట్లు ధనూష్ ఇటీవలే ప్రకటించాడు. అంతేకాదు, గురువారం ఉదయం ఆ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను కూడా రివీల్ చేయబోతున్నట్లు స్వయంగా వెల్లడించాడు.

  Dhanush and Venky Atluri film titled SIR

  ముందుగా చెప్పిన దాని ప్రకారం.. ధనూష్ - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రాబోతున్న ద్విభాషా చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను కొద్ది సేపటి క్రితమే రివీల్ చేశారు. దీనికి తెలుగులో 'సార్' అని, తమిళంలో 'వాతి' అనే పేరు పెట్టారు. వీటికి సంబంధించిన పోస్టర్లను కూడా విడుదల చేశారు. ఇందులో క్లాస్ రూంలో ఉన్న బోర్డుపై కొన్ని పాఠాలు రాసి ఉన్నాయి. దాని మీదే సినిమా టైటిల్‌ను చూపించారు. ఇక, దానికి ఎదురుగా అంటే రూమ్‌లో విద్యార్థులు బెంచ్‌లపై కూర్చుని ఉన్నట్లు చూపించారు. దీంతో టైటిల్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయని చెప్పొచ్చు.

  Bigg Boss: షణ్ముఖ్‌కు దీప్తి బ్రేకప్.. కలకలం రేపుతోన్న ఇన్‌స్టా స్టోరీలు.. ఇద్దరి మధ్య ఏం జరిగింది?

  'సార్' సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేస్తూ హీరో ధనూష్ 'నా తర్వాతి తమిళం చిత్రం.. మొట్టమొదటి తెలుగు సినిమా టైటిల్ సార్/వాతి' అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' వంటి ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి.. ఈ సారి ధనూష్‌తో సరికొత్త కథాంశంతో సినిమా చేయనున్నాడు. ఇందులో విద్యా వ్యవస్థలో ఉన్న లొసుగులను ఎత్తి చూపబోతున్నాడని తెలుస్తోంది. అలాగే, తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా చూపించబోతున్నాడట.

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సార్' మూవీని ఫార్చూన్ ఫోర్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇందులో నటించే హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను మాత్రం చిత్ర యూనిట్ వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలతో కూడిన ప్రకటనలు రాబోతున్నాయని తెలుస్తోంది.

  English summary
  Kollywood Star Hero Dhanush Now Busy with Several Tamil Films. Now He Annouce straight Telugu movie Under Venky Atluri Direction. This film titled SIR.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X