»   » సుచీలీక్స్: మైక్ విసరగొట్టిన ధనుష్.. యాంకర్‌పై ఆగ్రహం.. మధ్యలోనే వెళ్లిన వీఐపీ

సుచీలీక్స్: మైక్ విసరగొట్టిన ధనుష్.. యాంకర్‌పై ఆగ్రహం.. మధ్యలోనే వెళ్లిన వీఐపీ

Written By:
Subscribe to Filmibeat Telugu

తమిళ చిత్ర పరిశ్రమలో సుచీలీక్స్ ఉదంతం సంచలనం రేపింది. సినీ ప్రముఖుల కంటిపై నిద్ర లేకుండా చేశారు గాయని సుచిత్ర. కోలీవుడ్‌లోని ప్రముఖ హీరోలు ధనుష్, అనిరుధ్, రానా, త్రిష, ఆండ్రియా తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారికి సంబంధించిన సీక్రెట్ వీడియోలను సుచిత్ర ట్విట్టర్‌లో పెట్టి సోషల్ మీడియాలో భూకంపం సృష్టించిన పని చేసింది. అయితే ఆ తర్వాత నా ట్విట్టర్‌ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు అని సుచిత్ర వివరణ ఇచ్చింది. అయితే ఆ వివాదం క్రమేణా సద్దుమణగడంతో హీరోలు ఊపిరి పీల్చుకొన్నారు.

తాజాగా వీఐపీ2 ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ధనుష్ ఓ పాపులర్ మీడియా ఛానెల్‌ ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆగ్రహం చెందిన ధనుష్ మైక్ విసిరి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. అయితే ప్రోమోలో కనిపించిన సన్నివేశాలపై చర్చ జరుగుతున్నది.

ధనుష్‌పై ప్రశ్నల పరంపర

ధనుష్‌పై ప్రశ్నల పరంపర

ధనుష్ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ సుచీలీక్స్ వ్యవహారంపై యాంకర్ ప్రశ్నలు సంధించింది. సుచీలీక్స్ సందర్భంగా మానసిక వేదనకు గురయ్యావని తెలిసింది. దాని గురించి చెప్పమని ఆమె అడిగారు. దాంతో ధనుష్ చిరుబురులాడుతూ నేను మానసిక వేదనకు గురైనట్టు ఏవరు చెప్పారు అని యాంకర్‌ను నిలదీశాడు. దాంతో సదరు యాంకర్ కంగుతిన్నది.

Dandupalyam 2 Movie Leaked Scene, Sanjana Hot video
యాంకర్‌పై ధనుష్ అసహనం

యాంకర్‌పై ధనుష్ అసహనం

సుచీలీక్స్ వ్యవహారంలో ఆరోపణలు, వీడియోలు వచ్చాయి కదా అని మళ్లీ మరో ప్రశ్నను అడిగింది. దాంతో ధనుష్ షాక్‌కు గురయ్యాడు. ఆమెపై అసహనం వ్యక్తం చేశాడు. పదే పదే సుచీలీక్స్‌పై ప్రశ్నలు సంధించడంతో అసహనం తలకు ఎక్కింది. దాంతో యాంకర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసి అక్కడ నుంచి లేచేందుకు ప్రయత్నించాడు.

ధనుష్‌ను రెచ్చగొడుతూ..

ధనుష్‌ను రెచ్చగొడుతూ..

తను అసహనానికి గురైనట్టు గ్రహించిన మళ్లీ ధనుష్‌ను రెచ్చగొడుతూ.. సుచీలీక్స్ కారణంగా మీ దాంపత్య జీవితం కష్టాల్లో పడింది అనే వార్తలు వచ్చాయి. వాటిపై మీ స్పందన ఏమిటి అనగానే ధనుష్ కోపం పతాక స్థాయికి చేరింది. వెంటనే లేచి మైక్ విసిరి వేశాడు. ఇదో చెత్త ఇంటర్వ్యూ అని కోపంగా వెళ్లిపోయాడు. అయితే ఈ సన్నివేశాలు ఫుల్ లెంగ్త్ ఇంటర్వ్యూలో ఉంటాయా? ఆ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

సింగర్ సుచిత్ర ఆరోపణలు

సింగర్ సుచిత్ర ఆరోపణలు

తనపై తమిళ హీరో ధనుష్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ అప్పట్లో సుచిత్ర ఆరోపించింది. తనకు ఇచ్చిన కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపారని, మగతలోకి జారుకోగానే ఇద్దరూ తనపై పాశవికంగా ప్రవర్తించారని సంచలన కామెంట్స్ చేసింది. ఆ భయానక అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని పేర్కొంది.

ట్విట్టర్‌లో రానా, త్రిషల ఫొటోలు

ట్విట్టర్‌లో రానా, త్రిషల ఫొటోలు

సుచీ లీక్స్‌ సందర్బంగా త్రిష, రానా ఇద్దరు సన్నిహితంగా కలిసి ఉన్న చిత్రాలు ట్విట్టర్‌లో అప్పట్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత సుచీలీక్స్ వ్యవహారంపై రానా సరైన వివరణ ఇవ్వడంతో ఆ వివాదం అంతటితో ఆగిపోయిన సంగతి తెలిసిందే.

English summary
Dhanush had to deal with a slew of controversies related to his personal life in the last few months. His off-screen life came under media scrutiny after several controversial posts were leaked on south Indian playback singer and RJ Suchitra's Twitter page.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu