»   » ఆడవాళ్ల అందంపై ధర్మేంద్ర సంచలన కామెంట్

ఆడవాళ్ల అందంపై ధర్మేంద్ర సంచలన కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆడవాళ్ల అందంపై సంచలన కామెంట్ చేసారు. ఆడవారు వేసే డ్రెస్సులు టూ మచ్‌ ఓపెన్‌గా ఉంటే వారి అందం కొంతకాలానికే బోర్ గా ఉంటుంది. నిండుగా ధరిస్తేనే అందంగా ఉంటారు. పాత కాలం సినిమాల్లో హీరోయిన్లు పూర్తిగా కవర్ చేసే పొడుగు చేతుల జాకెట్లతో పాటు నిండుగా ఉండే డ్రెస్సులే వేసే వారు అని వ్యాఖ్యానించారు.

అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని, ఇప్పటి ట్రెండును నేనేమీ విమర్శించడం లేదు. తాను ఎవరినీ తప్పుబట్టడం లేదు. ఇప్పుడు పరిస్థితులు మారి పోయాయి అని మాత్రమే చెబుతున్నాను అంటూ ఆయన సెలవిచ్చారు.

Dharmendra: I feel too much openness after a while is boring

తను నటించిన తాజా సినిమా ‘సెకండ్ హ్యాండ్ హస్బెండ్' మూవీ జులై 3న విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా కామెడీ కాన్సెప్టు సాగుతుందని, క్లీన్ మూవీ, ఎలాంటి వల్గారిటీ ఈ సినిమాలో ఉండదు అన్నారు.

ఈ చిత్రానికి సమీప్ కాంగ్ దర్శకత్వం వహిస్తున్నారు. గిప్పీ గ్రేవాల్, తిను అహుజా, ధర్మేంద్ర, విజయ్ రాజ్, గీతా బస్రా, ముఖేష్ తివారీ, రవి కిషన్, గురుప్రీత్ గుగ్గి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

English summary
Dharmendra said, "I feel too much openness after a while is boring. It is my personal opinion, I am not criticising the trend, but I feel too much openness after a while is boring. Everything should be subtle."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu