»   » చిరు, రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, అఖిల్, రకుల్.... (మేకింగ్ వీడియో కేక)

చిరు, రామ్ చరణ్, ఉపాసన, బన్నీ, అఖిల్, రకుల్.... (మేకింగ్ వీడియో కేక)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ధృవ'. ఎలాంటి వేడుక లేకుండా ఇటీవలే ఆడియో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా సినిమాలోని 'నీతోనే డాన్స్' అనే సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.


ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతుండగా... సెట్స్‌కి మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ వైఫ్ ఉపాసన, సిస్టర్ సుష్మిత, బన్నీ, అఖిల్ తదితరులు వచ్చి సందడి చేసారు.


బన్నీ

బన్నీ

ధృవ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.


ఉపాసన

ఉపాసన

‘ధృవ' ఆడియో నవంబర్ 9న నేరుగా మార్గెట్లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన విధంగానే.... రాత్రి 12 గంటలకు ఆడియో రిలీజ్ చేసారు.


అఖిల్

అఖిల్

ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుపటం లేదు కాబట్టి ..సినిమా విడుద‌ల‌కు ముందు అభిమానులు, ప్రేక్ష‌కుల న‌డుమ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.


శృతి హాసన్

శృతి హాసన్

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది.


మేకింగ్ వీడియో

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.


English summary
Geetha arts Presents Neethoney Dance Song Making From Dhruva Telugu Movie Making Starring Ram Charan , Rakul Preet, Aravind Swamy , Music By , Directed by Surender Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu