»   » విక్రమ్ టీజర్‌లోనే ఇరుగదీశాడు.. ఇక సినిమా ఏ రేంజో.. హ్యాపీ బర్త్‌డే చియాన్!

విక్రమ్ టీజర్‌లోనే ఇరుగదీశాడు.. ఇక సినిమా ఏ రేంజో.. హ్యాపీ బర్త్‌డే చియాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ తర్వాత విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న చియాన్ విక్రమ్ జన్మదినం జరుపుకొంటున్నారు. విక్రమ్ జన్మదినం సందర్భంగా ధ్రువ నక్షత్రం చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది.

ఇండియాకు వచ్చేశాడు..

ఇండియాకు వచ్చేశాడు..

ధ్రువనక్షత్రం ఒకటో టీజర్‌లో ఎక్కడైతే ముగిసిందో అక్కడ నుంచి రెండో టీజర్‌లో మొదలైంది. ధ్రువ నక్షత్రం చిత్రంలో విక్రమ్ పాత్ర పేరు జాన్. అమెరికాలో నివసిస్తున్న జాన్ కొన్ని పరిస్థితుల కారణగా దేశ రాజధానికి చేరుకొంటారు. రెండో టీజర్‌లో అక్కడ నుంచి కథల మొదలవుతుంది. టీజర్‌లో పెర్ఫార్మెన్స్ చూసిన వారంతా ఈసారి విక్రమ్ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు చేయడం ఖాయమనే అభిప్రాయం అప్పుడే ఊపందుకొన్నది.

మీనన్ ట్వీట్..

ధ్రువ నక్షత్రం సినిమా రెండే టీజర్‌ను దర్శకుడు గౌతమ్ మీనన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. విలక్షణ నటుడు విక్రమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ సినిమాను తెరకెక్కించడంలో నీ పాత్ర గణనీయమైనది అని మీనన్ ట్వీట్ చేశాడు.

రితూ వర్మకు ఛాన్స్

రితూ వర్మకు ఛాన్స్

గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ కూడా ఉన్నాడు. మీనన్ సినిమాల్లో రాజేశ్ ఉండటం సర్వసాధారణమనే విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్‌గా నటించాల్సి ఉండేది. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆమె ఈ చిత్రాన్ని వదులుకొన్నది. ఆమె స్థానంలో పెళ్లిచూపులు ఫేం రితూవర్మకు అవకాశం దక్కింది.

సూర్య స్థానంలో విక్రమ్..

సూర్య స్థానంలో విక్రమ్..

ధ్రువ నక్షత్రం బౌర్న్ సిరీస్ మాదిరిగా తెరకెక్కుతున్నది. వాస్తవానికి సూర్యను హీరోగా పెట్టి ఈ సినిమాను తెరకెక్కిద్దామని గౌతమ్ మీనన్ ప్లాన్ చేవారు. కానీ కొన్ని కారణాల వల్ల విక్రమ్ ఈ సినిమాలో హీరోగా మారారు. గతేడాది ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను గౌతమ్ విడుదల చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది. దాదాపు 80 లక్షల మంది ఈ టీజర్‌ను వీక్షించడం గమనార్హం.

ఆగస్టులో ధ్రువ నక్షత్రం

ఆగస్టులో ధ్రువ నక్షత్రం

ఆన్‌డ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ మరో సంస్థతో కలిసి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికంటే ముందు గౌతమ్ మీనన్ తాను నిర్మిస్తున్న మరో చిత్ర ఎన్నాయ్ నోకి పాయమ్ థొట్టా అనే సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ధనుష్, మేఘా ఆనంద్ నటిస్తున్నారు.

English summary
Ahead of Vikram's birthday, Gautham Menon has released a new teaser from the much-awaited Dhruva Natchathiram, which is doing the rounds on the internet. Dhruva Natchathiram is a spy thriller made on the lines of the Bourne series. Gautham planned to direct the film with Suriya in the lead. However, the latter opted out the project due to various issues. Dhruva Natchathiram is expected to release in August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu