»   »  బాలీవుడ్ ముద్గుగమ్మ సోనమ్ కపూర్ ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ

బాలీవుడ్ ముద్గుగమ్మ సోనమ్ కపూర్ ఇంట్లో డైమండ్ నెక్లెస్ చోరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు బంగ్లాలో చొరబడి ఐదు లక్షల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్‌ను అపహరించారని సోనమ్‌కపూర్ ఫిర్యాదు చేశారని ముంబైలోని జుహు పోలీసులు వెల్లడించారు. సోనమ్‌ ఫిబ్రవరి 4న ముంబైలోని బాంద్రాలో ఓ పార్టీకి నెక్లెస్‌తోపాటు ఇతర జ్యువెల్లరీని ధరించి హాజరయినట్టు పోలీసులు తెలిపారు.

అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి నెక్లెస్‌ను భద్రపరిచినట్టు చెప్పారు. సోనమ్ భద్రపరిచిన నెక్లెస్ ఆ రాత్రి నుంచే కనబడటం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ చోరీపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. సోనమ్, ఆమె తల్లి సునీత 5వ తేదీన పోలీసులకు ఆ సంఘటనపై ఫిర్యాదు చేశారు.

Diamond Necklace Stolen from Bollywood Star Sonam Kapoor's Home

ప్రముఖ జ్యువెల్లర్ ఆమెకు ఆరు బాక్సుల ఆభరణాలు ఇచ్చాడని, కోట్లాది రూపాయల విలువ చేసే వాటిని ధరించి ఆమె పార్టీకి వెళ్లిందని అంటున్నారు. మర్నాడు జ్యువెల్లర్ ప్రతినిధి ఇంటికి వాటిని తీసుకోవడానికి వచ్చాడు. వాటిని తిరిగి ఇవ్వడానికి చూసినప్పుడు నెక్లెస్ కనిపించలేదు. జుహులోని విలె పార్లేలో సోనమ్ కపూర్ నివసిస్తోంది. ఆ ఇంటి పనిమనిషిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

తాము అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని, సోనమ్ కపూర్ పార్టీలో దాన్ని పోగొట్టుకుందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Actress Sonam Kapoor registered a complaint with the Juhu police on February 5 after she found a diamond necklace missing from her bungalow. The Juhu police have registered a theft case against unknown persons and have begun investigations.
Please Wait while comments are loading...