»   » రచయిత డైమండ్ రత్నబాబుకు మోహన్ బాబు గిఫ్ట్

రచయిత డైమండ్ రత్నబాబుకు మోహన్ బాబు గిఫ్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాజాగా విడుదలైన మంచు ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'పాండవులు పాండవులు తుమ్మెద' బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉండటం, మోహిని పాత్ర చిత్రీకరించిన తీరు ప్రేక్షకులకు తెగ నచ్చడంతో బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగులు అద్భుతంగా ఉండటం కూడా ప్లస్సయింది. ఈ చిత్రానికి మాటలు రాసింది డైమండ్ రత్నబాబు. 'ఈ నాయుడు మాట నిలుపుకోవడంలో స్ట్రాంగ్ వెనక్కి తీసుకోవడంలో వీక్', 'దిస్ ఈజ్ ద హ్యూమన్ సైకాలజీ ఆఫ్ ఎవ్రీ జనరేషన్..జెనరేషన్ విల్ చేంజ్ ట్ హ్యూమన్ సైకాలజీ విల్ నెవర్ చేంజ్' అంటి డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

 Diamond Ratna Babu

సినిమా విడుదలై హిట్ టాక్ కావడంతో మోహన్ బాబు రచయిత డైమండ్ రత్న బాబును పిలిచి రూ. లక్ష రూపాయలు గిఫ్టుగా ఇచ్చారు. రచయిత డైమండ్ రత్న బాబు మాట్లాడుతూ...ఇండస్ట్రీకి వచ్చిన ఏడేళ్ల తర్వాత ఈ చిత్ంరతో కెరీర్లో తొలి హిట్ వచ్చింది. నాకు ఈ అవకాశం రావడానికి కారణం దర్శకుడు శ్రీవాస్ . ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు. థియేటర్లో డైలాగులకు క్లాప్స్ కొడుతుంటే...డైలాగ్ రైటర్‌గా గర్వంగా ఫీలయ్యాను. ముఖ్యంగా సినిమా మోహిని లెటర్ సీన్‌లో లైట్ కాన్సెప్టుకు మంచి స్పందన వచ్చింది. మోహన్ బాబుగారు ఎంకరేజ్ చేయడం వల్లనే ఇంత మంచి డైలాగ్స్ రాయగలిగాను అన్నారు.

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రాన్ని నిర్మించారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కిన ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహించారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

English summary
Diamond Ratna Babu penned good dialogues for ‘Pandavulu Pandavulu Tummeda’. Srivaas is directing this Manchu family multi-starrer movie featuring Dr Mohan Babu, Manchu Vishnu, Manchu Manoj, Varun Sandesh, Tanish, Raveena Tandon, Hansika and Praneetha in the lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu