»   » బాలయ్య ‘డిక్టేటర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ (ఏరియా వైజ్)

బాలయ్య ‘డిక్టేటర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య తాజా చిత్రం ‘డిక్టేటర్' బాక్సాఫీసు వద్ద తొలి వారం మంచి ఫలితాలను రాబట్టింది. ఏపీ, తెలంగాణల్లో బాలయ్య అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించడంతో తొలివారం మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రం బిజినెస్ కొన్ని ఏరియాల్లో బాగున్నా, కొన్ని ఏరియాల్లో మాత్రం చాలా డల్ గా ఉంది.

ఈ చిత్రం ఇప్పటికే ఈస్ట్, వెస్ట్ ఏరియాల్లో ఇప్పటికే ప్రాఫిట్ జోన్లోకి వెళ్లిందని, అయితే వైజాగ్, నెల్లూరు, గుంటూరులో రెండో వారంలో ప్రాఫిట్ జోన్లోకి వెలుతుందని, సీడెడ్ ఏరియాలో సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే క్లాస్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం బిజినెస్ చాలా నిరుత్సాహ పూరితంగా ఉంది.


డిక్టేటర్ చిత్రం తొలి వారం రూ. 17.27 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఫలితాలపై దర్శకుడు శ్రీవాస్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నా సినిమా చూసి బావుందని మెచ్చుకుంటే మాత్రం సరిపోదు. నా సినిమాకు కాసులు కూడా కురవాలి. నా సినిమాను తీసుకున్న డిసి్ట్రబ్యూటర్లు లాభాలతో ఉండాలి. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను'' అని అంటున్నారు శ్రీవాస్‌.


‘‘డిక్టేటర్‌కి వస్తున్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతికి పర్ఫెక్ట్‌ సినిమాను తీశానని అందరూ మెచ్చుకుంటున్నారు. తమ కుటుంబం అంతా ఆనందంగా పండుగ జరుపుకుంటున్నామని, మంచి సినిమా ఇచ్చినందుకు కంగ్రాట్స్‌ అని చెబుతూ చంద్రబాబునాయుడుగారు ఫోన చేయడం మర్చిపోలేని అనుభూతిని కలిగించింది. ‘డిక్టేటర్‌' కథను కంప్లీట్‌గా బాలయ్యబాబుగారిని దృష్టిలో పెట్టుకునే రాశాను. నా కథ కన్నా ముందు నన్ను నమ్మి బాలయ్యగారు ఈ సినిమాను చేస్తానన్నారు. మా రైటర్స్‌తో కూర్చుని కంప్లీట్‌గా బాలయ్యగారి కోసమే కథ సిద్ధం చేశాం అన్నారు.


డిక్టేటర్ ఏరియా వైజ్ కలెక్షన్స్ స్లైడ్ షోలో...


నైజాం

నైజాం


నైజాం ఏరియాలో డిక్టేటర్ తొలివారం రూ. 3.35 కోట్లు వసూలు చేసింది.


సీడెడ్

సీడెడ్


సీడెడ్ ఏరియాలో ఈ చిత్రం తొలివారం రూ. 3.68 కోట్లు వసూలు చేసింది.


గుంటూరు

గుంటూరు


గుంటూరులో తొలి వారం రూ. 1.99 కోట్లు రాబట్టింది.


క్రిష్ణ

క్రిష్ణ


క్రిష్ణ ఏరియాలో తొలి వారం రూ. 93 లక్షలు రాబట్టింది.


ఈస్ట్

ఈస్ట్


ఈస్ట్ గోదావరి ఏరియాలో తొలివారం రూ. 1.64 కోట్లు రాబట్టింది.


వెస్ట్

వెస్ట్


వెస్ట్ గోదావరి ఏరియాలో తొలివారం రూ. 1.38 కోట్లు రాబట్టింది.


నెల్లూరు

నెల్లూరు


నెల్లూరు ఏరియాలో తొలివారం రూ. 85 లక్షలు రాబట్టింది.


కర్నాటక

కర్నాటక


కర్నాటకలో తొలివారం రూ. 1.10 కోట్లు రాబట్టింది.


ఓవర్సీస్

ఓవర్సీస్


ఓవర్సీస్ మార్కెట్లో తొలివారం రూ. 39 లక్షలు వసూలు చేసింది.


English summary
Nandamuri Balakrishna's Dictator has performed well in Andhra and Ceded areas. It has fared decently in some areas and pretty good in some areas. First Week Total 17.27 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu