»   » ప్రియుడి వద్దకు రెక్కలు కట్టుకుని వాలిపోయింది!

ప్రియుడి వద్దకు రెక్కలు కట్టుకుని వాలిపోయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమలో ఉన్న వాళ్లు ఎడబాటును అస్సలు భరించలేదు. పలు కారణాలతో దూరంగా ఉండాల్సి వచ్చినా...ఎప్పుడెప్పుడు రెక్కలు కట్టుకుని తాము ప్రేమించిన వారి వద్దకు వాలిపోదామా అని ఎదురు చూస్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ కొంతకాలంగా ఇలాంటి పరిస్థితే అనుభవిస్తోంది.

దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్ లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఉన్నంత వరకు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే దీపిక హాలీవుడ్ సినిమాలో నటిస్తుండటంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రియుడిని విడిచి ఉండాల్సిన వచ్చింది.

Did Deepika Padukone secretly meet boyfriend Ranveer Singh in Paris?

అయినా అప్పుడప్పుడు కలుస్తూనే వున్నారు. ఆ మధ్య శ్రీలంకలో జరిగిన దీపిక స్నేహితురాలి పెళ్లిలో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. తరువాత షూటింగ్ లలో బిజీగా ఉండడంతో వీలు చిక్కలేదు. తాజాగా తన హాలీవుడ్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో దీపిక రెక్కలు కట్టుకుని రణవీర్ సింగ్ వద్దకు వాలిపోయింది.

రణవీర్ ప్రస్తుతం 'బేఫికర్' షూటింగ్ భాగంగా పారిస్ లో ఉన్నారు. దీపిక రాక చూసి యూనిట్ సభ్యుల్లో కొందరు షాకైనా.....ఇలాంటి మామూలే అని కొందరు లైట్ తీసుకున్నారు. షూటింగ్ స్పాట్లో ఉన్న కొందరు ఇండియన్ అభిమానులు దీపిక అక్కడికి వచ్చిన సందర్భాన్ని ఫోటో తీయడానికి ప్రయత్నించినా యూనిట్ సిబ్బంది అడ్డుకున్నారట.

English summary
According to some reports, Deepika Padukone secretly flew to Paris to meet her boyfriend Ranveer Singh who is currently shooting for his upcoming film Befikre.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu