»   » అతనే ఎక్కువ: పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పింది!

అతనే ఎక్కువ: పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్, తమిళంలో పెద్ద స్టార్ విజయ్.....పవన్ కళ్యాణ్ తెలుగులో ఉన్నంత గుర్తింపు తమిళంలో లేదు, అదే విధంగా విజయ్ కూడా. తమిళంలో విజయ్ సినిమాలు బాగా ఆడతాయి. తెలుగులో పెద్దగా ఆడవు.

ఈ ఇద్దరి సినిమాల్లో నటించే అవకాశం వస్తే....ఏ స్టార్ హీరోయిన్ దాదాపుగా వదులుకోదు. ఇక మామూలు హీరోయిన్లు వీరి సినిమాల్లో అవకాశం దొరకడమే మహాభాగ్యంలా భావిస్తారు. అయితే ఇద్దరి సినిమాల్లో ఒకేసారి అవకాశం వస్తే....ఒకరి సినిమా కోసం మరొకరి సినిమా వదులుకోవాల్సి వస్తే.... తేల్చుకోవడం కష్టమే.

 Did Keerthy Suresh reject the offer to star pawan kalyan?

'నేను శైలజ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకన్న మళయాలీ బ్యూటీ కీర్తి సురేష్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కేసినిమాలో ఈమెను తీసుకోవాలనుకున్నారు. అయితే అదే సమయంలో కీర్తి సురేష్ కు తమిళంలో విజయ్ సినిమాలో చేసే అవకాశం దక్కింది.

దీంతో పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పి....విజయ్ సినిమాలో చేయడానికే ప్రాధాన్యం ఇచ్చిందట ఈ భామ. కీర్తి సురేష్ ఫోకస్ అంతా తమిళ సినిమాల మీద ఉండటంతోనే పవన్ సినిమాను వద్దనుకుందని, విజయ్ సినిమాలో చేస్తే తమిళంలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ఆమె ఇలా చేసిందని అంటున్నారు.

 Did Keerthy Suresh reject the offer to star pawan kalyan?

పవన్, ఎస్.జె.సూర్య కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం ఇది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం గత నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా జూన్ 2 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది.

English summary
Film Nagar source said that, Keerthy Suresh reject the offer to star pawan kalyan, directed by SJ Surya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu