twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏది నిజం?: 'కత్తి' తప్పులో కాలేశాడా!, పవన్-త్రివిక్రమ్ తాంత్రిక పూజల లోగుట్టు ఇదేనా?

    |

    Recommended Video

    పవన్-త్రివిక్రమ్ తాంత్రిక పూజల లోగుట్టు ఇదేనా?

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్-మహేష్ కత్తికి నడుమ వివాదం తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలోకి ఎంటరవ్వాలంటేనే ప్రతీ ఒక్కరూ జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరికి మద్దతు ఇస్తే ఎటువైపు నుంచి టార్గెట్ చేయబడుతామోనన్న భయం వెంటాడుతోంది.

    మరోవైపు ఫిలిం క్రిటిక్ కత్తి చేసిన ఆరోపణలను పవన్ కల్యాణ్ వర్గం తప్పు అని నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర వార్త తెర పైకి వచ్చింది. కత్తి ఆరోపించినట్లు త్రివిక్రమ్-పవన్ తాంత్రిక పూజలేవి చేయలేదని దాని వెనుక అసలు గుట్టు ఇది అని ఓ కథనం వెలుగులోకి వచ్చింది. అదేంటో చూద్దాం..

     త్రివిక్రమ్‌కు ఆ దేవుడిపై నమ్మకం ఎక్కువ..:

    త్రివిక్రమ్‌కు ఆ దేవుడిపై నమ్మకం ఎక్కువ..:

    పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎస్.జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా మహా సంపుటిత, శ్రీ జ్వాల నరసింహస్వామి సుదర్శన యాగం నిర్వహించడం ఆనవాయతీ. ఇక్కడి స్వామి వారిపై త్రివిక్రమ్‌కు నమ్మకం ఎక్కువ.

    సహాయం చేస్తే.. లింకేనా?, కాస్త ఎదగరా బాబు: కత్తికి బన్నీ కౌంటర్, సంజన కూడా!సహాయం చేస్తే.. లింకేనా?, కాస్త ఎదగరా బాబు: కత్తికి బన్నీ కౌంటర్, సంజన కూడా!

     ప్రతీ ఏటా సుదర్శన యాగం.. :

    ప్రతీ ఏటా సుదర్శన యాగం.. :

    జ్వాల నరసింహస్వామి ఆలయంలో ప్రతీ ఏటా మహాశివరాత్రి ముందు రోజు, మహాశివరాత్రి రోజున సుదర్శన యాగం నిర్వహిస్తుంటారు. దైవ కృప కోసం ప్రతీ ఏటా ఇక్కడ నిర్వహించే యాగానికి త్రివిక్రమ్ హాజరువతారు.

     త్రివిక్రమ్‌తో పాటు:

    త్రివిక్రమ్‌తో పాటు:

    తానొక్కడే కాకుండా.. ఆ సమయంలో తాను వర్క్ చేస్తున్న సినిమా యూనిట్ ను కూడా ఈ యాగానికి త్రివిక్రమ్ ఆహ్వానిస్తారట. అందులో భాగంగానే 2009లో నిర్వహించిన యాగంలో పవన్-త్రివిక్రమ్ పాల్గొన్నారని అంటున్నారు.

     సునీల్ కూడా:

    సునీల్ కూడా:

    2014లో త్రివిక్రమ్ తో పాటు ఈ యాగానికి హీరో సునీల్ కూడా హాజరైనట్లు చెబుతున్నారు. 2009నుంచి క్రమం తప్పకుండా ప్రతీ ఏటా త్రివిక్రమ్ ఇక్కడ యాగం నిర్వహించారట. త్రివిక్రమ్ ఒక్కడే కాదు.. ప్రతీ ఏటా శివరాత్రికి నిర్వహించే సుదర్శన యాగంలో చాలామంది సినీ ప్రముఖులు పాల్గొంటారని అక్కడి పండితులు చెప్పినట్లు తెలుస్తోంది.

     ఏది నిజం?:

    ఏది నిజం?:

    ఈ కథనం వెలుగులోకి రావడంతో మహేష్ కత్తి చేసిన క్షుద్ర పూజ ఆరోపణల్లో పస లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే మహేష్ కత్తి తన వద్ద సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెబుతుండటం గమనార్హం. మహేష్ కత్తి సుదర్శన యాగాన్నే క్షుద్ర పూజగా పొరబడ్డారా?.. లేక నిజంగానే బయటకు రాని విషయాలేమైనా ఉన్నాయా? అన్నది వేచి చూడాల్సిందే.

    దొరికిపోయిన పూనమ్: అడ్డంగా బుక్ చేసిన ‘కత్తి'... మద్దతిస్తున్నట్లు ట్వీట్స్!దొరికిపోయిన పూనమ్: అడ్డంగా బుక్ చేసిన ‘కత్తి'... మద్దతిస్తున్నట్లు ట్వీట్స్!

    English summary
    Kathi Mahesh has waged a war against Pawan Kalyan and his fans and this war which was confined to social media has now taken a new turn, with allegations of Kathi Mahesh in the name of questions to Poonam Kaur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X