»   » వక్కంతం,ఎన్టీఆర్ ప్రాజెక్టు కాన్సిల్ కి కారణం చెప్పిన కళ్యాణ్ రామ్

వక్కంతం,ఎన్టీఆర్ ప్రాజెక్టు కాన్సిల్ కి కారణం చెప్పిన కళ్యాణ్ రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొంతకాలంగా ఎన్టీఆర్ హీరోగా.., వక్కంతం వంశీ దర్శకత్వంలో, కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఓ చిత్రం రాబోతోందని ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ విషయం ఖరారు చేస్తూ పోస్టర్స్ సైతం వేసారు. అయితే అంతా ఖరారు అనుకున్న సమయంలో సీన్ రివర్స్ అయ్యింది. వక్కంతం సైడ్ లైన్ అయ్యారు. దీనికి కారణం ఎవరికి తోచింది వారు చెప్పుకున్నారు. కానీ తాజాగా కళ్యాణ్ రామ్ ఈ విషయమై మాట్లాడారు.

వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చలేదు. అందుకే, ఎన్టీఆర్ హీరోగా వంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా పక్కన పెట్టేశాం అని తేల్చి చెప్పారు హీరో కళ్యాణ్ రామ్.

పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్, ప్రస్తుతం ఇజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లోనే బిగెస్ట్ బడ్జెట్ తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

 Didn't Like Vakkantham's Story: Kalyanram

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇజం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని క్లియర్ చేసారు.

ఇక ఇజం చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని పక్కాగా రెడీ అయిపోయింది. సెన్సార్ బృందం ఈ సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. పూరీ స్టైల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటించారు. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో ఈమధ్యే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది.

కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్‌గా కనిపించనున్న 'ఇజం', ఇంటర్నేషనల్ బ్లాక్‌మనీ అనే అంశంపై తెరకెక్కిందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు.

English summary
Kalran Ram revealed that they didn't like the story narrated by Vakkantham Vamsi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu