»   » పవన్ తో..... దిల్ రాజు చిరకాల కోరిక ఇక తీరదా..?

పవన్ తో..... దిల్ రాజు చిరకాల కోరిక ఇక తీరదా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తో పని చేయడం నా డ్రీమ్ కాదని, జీవిత లక్ష్యమని చెప్పేవారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. మంచి స్క్రిప్ట్ తీసుకురా.. తప్పకుండా సినిమా చేద్దామని పవన్ కళ్యాణ్ మాటిచ్చాడని. ప్రస్తుతం అదే పనిలో ఉన్నానని కొద్దిరోజుల కిందటే అన్నాడు కూడా. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఆడియో‌ ఆవిష్కరణలో భాగంగా ఆదివారం సాయంత్రం దిల్ రాజు ఈ మాట చెప్పగానే చాలా మంది హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని చాలామందే కోరుకున్నారు కూడా...

అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలకి ఎక్కటం అనుమానమే నట. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్న తన కల కలగానే మిగిలిపోతుందేమో అని ఆవేదన వ్యక్తం చేశాడు దిల్ రాజు. వచ్చే ఎన్నికలతో పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఇంకో రెండు మూడు సినిమాలకు మించి చేయనని స్పష్టం చేసిన పవన్. ఇప్పటికే మూడు సినిమాలకీ కమిట్ అయ్యాడు.

Dil Raju About Movie With Pawan

ఇక ఆ సినిమాలు పూర్తయ్యే టప్పటికి 2019 వచ్చేస్తుంది. ఇక ఈ పరిస్థితుల్లో దిల్ రాజు సినిమా ఎలా?? ఐతే పవన్‌తో సినిమా కోసం తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదట. ఆలోపే సినిమాని మొదలు పెట్టే అవకాశం ఉండకపోదా అని చూస్తున్నాడు. అయినా ఆ కోరిక నెరవేరేదేమో అని అనుమానం గానే ఉందంటూ చెప్పాడు ఈ క్రేజీ నిర్మాత.

"పవన్ కల్యాణ్‌తో సినిమా చెయ్యాలన్నది నా కోరిక. అది అలాగే మిగిలిపోతుందేమోనని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఆయనతో సినిమా చెయ్యొచ్చు.. చెయ్యకపోవచ్చు. ఏ విషయము ఇప్పట్లో చెప్పలేను" అంటూ చెప్పాడు.

English summary
Star producer Dil raju little disappointed about his new project with Pawan kalyan... may his dream not going to be True.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu