»   » స్పైడర్ రిలీజ్ డేట్ ఇదే, దిల్ రాజు కళ్ళు తిరిగే నిర్ణయం

స్పైడర్ రిలీజ్ డేట్ ఇదే, దిల్ రాజు కళ్ళు తిరిగే నిర్ణయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ ప్రధాన పాత్రలో స్పైడర్ అనే చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు ఇటీవల మహేష్ లుక్స్ కి సంబంధించి కొన్ని పోస్టర్స్ విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్తేజాన్ని తెచ్చారు మూవీ మేకర్స్. ఇక టీజర్ కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తూ వస్తున్నారు.

ఈ చిత్ర టైటిల్‌,

ఈ చిత్ర టైటిల్‌,

ఫస్ట్‌లుక్‌ విషయంలో చిత్ర యూనిట్‌ చాలా సార్లు అభిమానులను నిరాశ పర్చింది. ఎప్పుడో విడుదలవాల్సిన ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ కారణంగా చాలా ఆలస్యంగా విడుదల అయ్యింది. ఆ విషయంలో అభిమానులు చాలా నిరాశ పడ్డారు. ముందుగా అనుకున్న రిలీజ్‌ డేట్‌ కూడా వాయిదా పడిది.


టీజర్ రిలీజ్ మీద కన్ఫ్యూజన్

టీజర్ రిలీజ్ మీద కన్ఫ్యూజన్

అలాగే మే 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా టీజర్ వస్తుందని కొందరూ, లేదూ వాయిదా పడిందని మరికొందరూ చెప్తూ..., అసలు టీజర్ రిలీజ్ మీద కన్ఫ్యూజన్ తెచ్చారు. ఈ వార్తలకి అడ్డు కట్ట వేసేందుకు స్వయంగా మహేష్ రంగంలోకి దిగి చిత్ర రిలీజ్ డేట్ మరియు టీజర్ టైం ఫిక్స్ చేశాడు.


మే 31 సాయంత్రం 5 గంటలకు

మే 31 సాయంత్రం 5 గంటలకు

స్పైడర్ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తామని తన ట్విట్టర్ ద్వారా తెలిపిన ప్రిన్స్ , టీజర్ ని మే 31 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపాడు. దీంతో అభిమానులలో కొత్త ఉత్సాహం నెలకొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తుంది. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


దిల్ రాజు

దిల్ రాజు

అయితే ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏమిటంటే కొంత కాలంగా సినీ నిర్మాణం తప్ప.. డిస్ట్రిబ్యూషన్ కు దూరంగా ఉన్న దిల్ రాజు.. మహేష్ బాబు స్పైడర్ చిత్రానికి నైజాం రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే.. ఇందుకోసం దిల్ రాజు చెల్లించిన మొత్తమే షాకింగ్ గా ఉంది.


బాహుబలి2 మినహాయిస్తే.

బాహుబలి2 మినహాయిస్తే.

స్పైడర్ కోసం.. ఏకంగా 25 కోట్ల రూపాయలకు దిల్ రాజు డీల్ సెట్ చేసుకున్నాడట. నైజాంలో బాహుబలి2 మినహాయిస్తే.. ఇప్పటివరకూ ఇదే అతి పెద్ద డీల్ కావడం విశేషం. అయితే.. ఇక్కడ బాహుబలి..2 70 కోట్ల షేర్ వసూలు చేయడం గమనిస్తే.. నైజాం స్టామినా ఏంటో అర్ధమవుతుంది.


నైజాంలో 20 కోట్ల రూపాయలు

నైజాంలో 20 కోట్ల రూపాయలు

మరోవైపు మహేష్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు నైజాంలో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే.. స్పైడర్ బ్రేక్ ఈవెన్ కు రావాలంటేనే.. శ్రీమంతుడు కంటే 25పర్సెంట్ అధికంగా షేర్ రావాలి. అలాగే ఖైదీ నంబర్ 150..కాటమరాయుడు చిత్రాలను కూడా ఇక్కడ 20 కోట్లకే విక్రయించారు.


ఏకంగా 25 కోట్లు

ఏకంగా 25 కోట్లు

ఇప్పుడు ఏకంగా 25 కోట్లకు స్పైడర్ మూవీ నైజాం రైట్స్ కొని.. సెన్సేషన్ సృష్టించేస్తున్నారు దిల్ రాజు. ఇంతకీ ఇంత హెవీ బడ్జెట్ తో వస్తున్న సినిమా అంతే స్థాయి లాభాలను తెస్తుందా అన్నదే కాస్త భయపెట్టే అంశం గానీ... ఒక వేళ సక్సెస్ అయితె మాత్రం పంట పండినట్టే...English summary
According to sources, Dil Raju bought Nizam distribution rights of Spyder for a whopping Rs. 25 crore. It is the highest ever amount offered in the region besides Baahubali 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu