»   » పవన్‌కళ్యాణ్, చరణ్ కలిసి మాట్లాడుకునే....

పవన్‌కళ్యాణ్, చరణ్ కలిసి మాట్లాడుకునే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్‌కళ్యాణ్, చరణ్ కలిసి మాట్లాడుకుని 21న డేట్ ఫిక్స్ చేశారు. కాబట్టి ఆగస్ట్ 21న సినిమాని విడుదల చేస్తున్నాం. కొందరు మీడియావాళ్లు మా సినిమా గురించి రాంగ్ వర్డ్స్ వాడుతున్నారు. పవన్‌కల్యాణ్‌కి భయపడి చరణ్ వెనక్కి తగ్గాడని ఇష్టం వచ్చినట్లు రాయడం కరెక్ట్ కాదు అంటూ దిల్ రాజు చెప్పటం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడో ఏదో మీడియాలో వచ్చిందని..దాన్ని దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పటం అందరికీ ఆశ్చర్యంగా మారింది.

అలాగే...''కల్యాణ్ బాబాయ్. చరణ్ అబ్బాయ్. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడు కానీ భయపడడు. ఏ సినిమా అయినా తెరపై చూస్తేనే సత్తా ఏంటో తెలిసేది. నాకు తెలిసి అత్తారింటికి దారేది, ఎవడు... రెండూ పెద్ద హిట్టయ్యే సినిమాలే'' అని 'దిల్' రాజు అన్నారు. గత కొద్ది రోజులుగా... ఎవడు చిత్రం చివరి నిముషంలో వాయిదా పడిన దగ్గర నుంచీ.. మీడియాలో రకరకాల ఊహాగానాలతో వార్తలు ప్రసారం అవుతున్నాయి.

కొందరు తెలంగాణా ఇష్యూ గురించి అనీ,మరికొందరు పవన్ కి భయపడి..సినిమా ఆపుచేసారని, ఈ నేపధ్యంలో దిల్ రాజు ఈ ప్రకటన చేసారు. దిల్ రాజు చెప్పిన మాటలు విన్నవారంతా...అనసరసంగా జనాలు పెద్దగా పట్టించుకోని విషయాన్ని హైలెట్ చేసారని అంటున్నారు.


రామ్‌చరణ్, శ్రుతిహాసన్, అమీజాక్సన్ కాంబినేషన్‌లో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాజు నిర్మించిన చిత్రం 'ఎవడు'. ఈ నెల 31న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 21కి వాయిదా వేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ -''చరణ్‌కి కల్యాణ్‌గారిపై ఉన్న గౌరవం, కల్యాణ్‌గారికి చరణ్‌పై ఉన్న ప్రేమ ఈ సినిమా విడుదల తేదీ మారేట్లు చేసింది'' అన్నారు.

అలాగే..-''రెండేళ్లు ఈ సినిమా కోసం శ్రమించాం. నిన్ననే ఈ సినిమా చూశాను. కథ విన్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో, చూసినప్పుడు అంతే ఉద్వేగానికి లోనయ్యాను. ఇదే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం. 'ఖలేజా' టైమ్‌లో కూడా 'బృందావనం'ని ఓ వారం వాయిదా వేసి, హిట్ కొట్టాం. మళ్లీ ఆ ఫీట్ రిపీట్ అవుతుంది'' అని చెప్పారు.

English summary

 Dil Raju Clarifies that there no fear with Pawan Factor. Yevadu film postphoned for other reasons.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu