»   » కంగ్రాట్స్ :అధ్యక్షుడిగా దిల్‌ రాజు ఎంపిక

కంగ్రాట్స్ :అధ్యక్షుడిగా దిల్‌ రాజు ఎంపిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలంగాణ మూవీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి తెలంగాణ మూవీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యక్షుడిగా విజయేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సానా యాదిరెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా సంగకుమారస్వామి, కోశాధికారిగా బాల గోవిందరాజు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా అల్లాణి శ్రీధర్‌, సంగిశెట్టి దశరథ, సత్యనారాయణగౌడ్‌ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారుడిగా బి.నరసింగరావు వ్యవహరిస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

''తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకొంది. అందుకు కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు. చిత్రసీమ ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. వాటికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం. చిన్న నిర్మాతల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి కృషి చేస్తాం. త్వరలోనే ముఖ్యమంత్రిని కలసి మా సమస్యల్ని ఆయన ముందుంచుతాం'' అని సానాయాదిరెడ్డి తెలిపారు.

ప్రస్తుతం దిల్ రాజు....

Dil Raju elected as Telangana Film Chamber President

‘కేరింత' పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎమ్ ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఈ చిత్రం చేస్తున్నారు. ‘వినాయకుడు' ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం లా చిత్రం ఉంటుందని దిల్ రాజు చెప్తున్నారు. 'వినాయకుడు' తో తానేంటో నిరూపించున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి కొత్త చిత్రం 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ హీరోగా చేస్తున్నారు. అలాగే మణిరత్నం తమిళంలో రూపొందిస్తున్న ఓకే కన్మణి చిత్రాన్ని తెలుగులో ఓకే బంగారంగా అందిస్తున్నారు. వీటిన్నటితో పాటు ..అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని నైజాం లో పంపిణీ చేస్తున్నారు.

English summary
Ace Producer Dil Raju has been elected as president of Telangana Film Chamber of Commerce (TFCC). While Vijayendar Reddy will serve as Vice President, B Narsinga Rao was appointed as Chief Advisor.
Please Wait while comments are loading...