»   » పవన్ కళ్యాణ్‌‌తో సినిమా ఓకే అయింది: దిల్ రాజు ప్రకటన

పవన్ కళ్యాణ్‌‌తో సినిమా ఓకే అయింది: దిల్ రాజు ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కల్యాణ్ హీరోగా దిల్ రాజు సినిమా చేయాలని చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. ఎట్టకేలకు దిల్ రాజుకు ఆ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఆయనతో సినిమా ఓకే అయింది అవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. మంచి స్క్రిప్ట్ తోపాటు సమర్ధుడైన దర్శకుడి కోసం అణ్వేషిస్తున్నా అని దిల్ రాజు సోమవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను ప్రస్తావిస్తూ.. 'నిజానికి చిరంజీవిగారి 150 సినిమాను నేనే తీద్దామనుకున్నా. కానీ వాళ్లబ్బాయి రాంచరణ్ ఆ అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వదల్చుకోలేదు. అయితే నిర్మాతగా కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా ఆ సినిమాలో నాదైన పాత్రను పోశిచాలనుకుంటున్నా. చిరంజీవి 150వ సినిమాను నైజాం ఏరియాలో నేనే పంపిణీ చేస్తా' అని పేర్కొన్నారు.

Dil Raju film with Pawan Kalyan

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత దిల్ రాజు బేనర్లో ఆయన సినిమా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దిల్ రాజు తన తాజా సినిమా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నారు.

English summary
Producer Dil Raju has confirmed he will soon team up with actor-politician Pawan Kalyan for a project.
Please Wait while comments are loading...