For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు.... డ్రగ్స్, డిజే, ఫిదా, మహేష్ మూవీపై దిల్ రాజు

  By Bojja Kumar
  |

  తెలుగు అగ్రనిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు జులై 21న 'ఫిదా' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా 'డిజె' చిత్రానికి సంబంధించి కలెక్షన్ల వివాదంపై ప్రశ్నలు ఎదురవ్వగా 'దిల్ రాజు ఎప్పుడూ రాంగ్ స్టేట్మెంట్స్' ఇవ్వడు అని సమాధానం ఇచ్చారు.

  దిల్ రాజు తన బేనర్లో నిర్మించిన 25వ చిత్రం 'డిజె' కలెక్షన్లపై సోషల్ మీడియాలో బ్యాడ్‌గా ప్రచారం జరిగింది. సినిమా ప్లాప్ అయిందని, దాన్ని కవర్ చేసేందుకు కలెక్షన్లు కావాలనే ఎక్కువ చేసి చూపెడుతున్నారనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

  సాయి పల్లవి రెబల్ యాటిట్యూడ్: 'ఫిదా' చేస్తోన్న కొత్త ట్రైలర్!

  ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం ప్రాకులాడను

  ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం ప్రాకులాడను

  ఫాల్స్‌ ప్రెస్టీజ్‌ కోసం కలెక్షన్లను యాడ్‌ చేసి నేనెప్పుడూ చెప్పను. సినిమా జయాపజయాలను ఉన్నదున్నట్టుగా స్వీకరించే పరిపక్వత నాకుంది. నేను మీడియా ముందుకొచ్చి చెప్పే ప్రతి విషయానికీ ఓ వేల్యూ ఉంటుంది. అందుకే రాంగ్‌ స్టేట్‌మెంట్స్‌ ఇవ్వను అని దిల్‌రాజు అన్నారు.

  Dil Raju Speech Over DJ Collections @DJ Thank You Meet | Filmibeat Telugu
  డిజె నిర్మాతగా ఫుల్ హ్యాపీ

  డిజె నిర్మాతగా ఫుల్ హ్యాపీ

  డీజే నిర్మాత‌గా నేను చాలా హ్యాపీ. స‌క్సెస్‌మీట్ రోజునే హ్యాట్రిక్ మూవీ అని అనౌన్స్ చేశానంటేనే సినిమా నిర్మాత‌గా నేను స‌క్సెస్ అయిపోయాను. స‌క్సెస్ సినిమా తీయ‌న‌ప్పుడు నేను మాట్లాడ‌ను. డీజే సినిమా బ‌న్ని కెరీర్‌లో బెస్ట్ మూవీ స‌రైనోడు రెవెన్యూను క్రాస్ చేసిందంటే అది హిట్టా, ఫెయిలా అని ఆలోచించుకోవాలి అని దిల్ రాజు అన్నారు.

  డిజె విషయంలోనే ఎందుకిలా?

  డిజె విషయంలోనే ఎందుకిలా?

  ఇప్పటికే ‘శతమానం భవతి', ‘నేను లోకల్‌', ‘డీజే'తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాం. డీజే కలెక్షన్ల గురించి వివాదాలు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మావంటి నమ్మకమైన సంస్థలు ‘హిట్‌' అని ప్రకటించాక కూడా అందులో తప్పులు వెతకడం భావ్యం కాదు అని దిల్ రాజు అన్నారు.

  విష సంస్కృతి

  విష సంస్కృతి

  పరిశ్రమలో ‘డిజె'కు ఎదురైన పరిస్థితి ఒక హీరోకి తలెత్తిందంటే మిగిలిన హీరోలకీ జరుగుతుందని గుర్తుంచుకోవాలి. విష సంస్కృతిని పెంచి పోషించకూడదని హీరోలు తమ అభిమానులకు చెప్పాలి అని దిల్ రాజు అభిప్రాయ పడ్డారు.

  డ్రగ్స్ వ్యవహారం గురించి

  డ్రగ్స్ వ్యవహారం గురించి

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం గురించి ప్రశ్నించగా.... డ్రగ్స్ గురించి నాకు తెలియ‌దు. ఎందుకంటే నేను డీజే విడుద‌ల త‌ర్వాత యుఎస్‌కు వెళ్ళిపోయాను. కాబ‌ట్టి ఇక్క‌డేం జ‌రిగిందో నాకు తెలియ‌దు అని స్పష్టం చేశారు దిల్ రాజు.

  ఫిదా బడ్జెట్ పెరిగింది

  ఫిదా బడ్జెట్ పెరిగింది

  మంచి సినిమాకు ఎంత ఖ‌ర్చు పెట్టాల‌నేది నేను ముందుగానే యోచిస్తాను. ఫిదా విష‌యంలో మేం అనుకున్న బ‌డ్జెట్ కంటే ప‌దిశాతం ఎక్కువైంది. అయినా ఎలాంటి బాధ లేదు, మేము అనుకున్న రిజల్ట్ వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

  ఆంధ్రా తెలంగాన లవ్ స్టోరీ కాదు

  ఆంధ్రా తెలంగాన లవ్ స్టోరీ కాదు

  `ఫిదా` ఆంధ్ర‌, తెలంగాణకు చెందిన ప్రేమ‌క‌థ కాదు. అమ్మాయి తెలంగాణ‌కు చెందిన భాన్సువాడ‌, అబ్బాయి యుఎస్‌లో సెటిల్ అయిన ఆంధ్ర ఫ్యామిలీకి చెందిన‌వాడు. ఇది ప్రాంతాల‌కు చెందిన ప్రేమ క‌థ కాదు. ఓ పెళ్ళిలో క‌లిసిన హీరో హీరోయిన్లు వారి క‌ల‌ల‌ను ఎలా నేర‌వేర్చుకున్నార‌నేదే క‌థ అని దిల్ రాజు తెలిపారు.

  సాయి పల్లవి కోసం వెయిట్ చేశాం

  సాయి పల్లవి కోసం వెయిట్ చేశాం

  శేఖర్ చెప్పిన కథ విన్న తర్వాత వరుణ్ తేజ్ తో చేయాలని ఫిక్స్ అయ్యాను. సాయిప‌ల్ల‌వి హీరోయిన్ క్యారెక్ట‌ర్ చేస్తే బావుంటుంద‌ని నేనే చెప్పాను. సాయిప‌ల్ల‌విని కాంటాక్టు చేయగా ఆమె మెడిసిన్ చ‌దువుతుంది. ఆమెకోసం ఆరు నెలలు వెయిట్ చేశాం. ఈ సినిమా కోసం సాయి పల్లవి తెలంగాణ యాస నేర్చుకుని డ‌బ్బింగ్ చెప్పింది. సాయి పల్లవి క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని దిల్ రాజు తెలిపారు.

  శేఖర్ గొప్ప కథలేం రాయడు

  శేఖర్ గొప్ప కథలేం రాయడు

  శేఖ‌ర్ గొప్ప క‌థ రాయ‌డు. కానీ గొప్ప సీన్స్‌ను రాస్తాడు. అతడికి రైట్ టైంలో వ‌స్తున్న సినిమా ఇది. సినిమా లేటు కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సినిమా అనుకున్నపుడు వరుణ్ తేజ్ వేరే షూటింగులో ఉండటం, తర్వాత అతడి కాలు ఫ్యాక్చర్ కావడం, సాయి పల్లవి డేట్స్, ఇలా చాలా ఉన్నాయని దిల్ రాజు తెలిపారు.

  రామ్ చరణ్‌తో మూవీ గురించి

  రామ్ చరణ్‌తో మూవీ గురించి

  రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేస్తాను. కానీ ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదు. రెడీ అయిన త‌ర్వాత హీరో వినాలి. ఆయ‌న‌కు న‌చ్చాలి. అన్ని కుదిరితే అధికార‌కంగా నేనే ప్ర‌క‌టిస్తాను అని దిల్ రాజు తెలిపారు.

  మహేష్ బాబుతో మూవీ

  మహేష్ బాబుతో మూవీ

  మహేష్‌బాబు, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో నేను నిర్మించబోయే సినిమా జ‌న‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షెడ్యూల్ జ‌రుగుతుంది... త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని దిల్ రాజు తెలిపారు.

  తర్వాతి సినిమాల గురించి

  తర్వాతి సినిమాల గురించి

  ప్రస్తుతం మేం నిర్మిస్తున్న ‘రాజా ది గ్రేట్‌'ను అక్టోబర్‌ 12న విడుదల చేస్తాం. ‘ఎంసీఏ'ను డిసెంబర్‌లో విడుదల చేస్తాం. వచ్చే సంక్రాంతికి మహేశ్‌ సినిమా, ఆ తర్వాత ‘శ్రీనివాస కల్యాణం' ప్రారంభమవుతాయని దిల్ రాజు తెలిపారు.

  English summary
  Check out Dil Raju interview about Fidaa movie. Fidaa is an upcoming Telugu romance film written and directed by Sekhar Kammula.It features Varun Tej and Sai Pallavi in the lead roles which marks the latter's debut in Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X