»   » డీజే విడుదలకు ముందే బుక్ చేసేసాడు: దిల్ రాజు బిజినెస్ బుర్ర అదీ

డీజే విడుదలకు ముందే బుక్ చేసేసాడు: దిల్ రాజు బిజినెస్ బుర్ర అదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిజె - దువ్వాడ జగన్నాథమ్‌ ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో సెన్సేషనల్ టాపిక్ ఏదన్నా ఉందీ అంటే అది అల్లు అర్జున్ డీజేనే. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇది గనక పెద్ద హిట్‌ అయితే హీరోయిన్‌ పూజా హెగ్డేతో పాటు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌కి కూడా డిమాండ్‌ పెరిగిపోతుంది.

అంత డిమాండ్ పెరిగాక రెమ్యునరేషనూ పెరిగిపోతుంది మరి అప్పుడు కాస్ట్లీ డైరెక్టర్, హై రెమ్యునరేషన్ హీరోయిన్ కంటే ఇప్పుడే తక్కువలో బుక్ చేసేద్దాం అనుకున్నాడేమో గానీ డీజే విడుదలకి ముందే ఈ ఇద్దరితోనూ దిల్‌ రాజు ఒప్పందం చేసేసుకున్నాడట. హరీష్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు తీసేదీ స్పష్టత లేకపోయినా కానీ అతనికి అడ్వాన్స్‌ అయితే ఇచ్చేసాడని, హరీష్‌ తదుపరి చిత్రం బయటి బ్యానర్లో చేసుకున్నా, లేక తనకే చేసినా ఓకే అని చెప్పాడని, అయితే డీజేకి ఇచ్చిన పారితోషికం కంటే ఇరవై శాతం మాత్రం హైక్‌ ఇస్తానని చెప్పాడట.


Dil Raju makes a deal with Pooja Hegde and Harish shankar

ఇక పూజ హెగ్డే కి అయితే మరో ఆఫర్ కింద (డీజే వచ్చాక ఆఫర్ ఎవరికి అన్నది స్పష్టం అవుతుంది) రెండు సినిమాలు సైన్‌ చేయించాడట. మహేష్‌తో వంశీ పైడిపల్లి తీసే సినిమాలో ఆమె నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. దువ్వాడ రిలీజ్‌ తర్వాత పూజ ఎంత స్టార్‌ అయినా కానీ దిల్‌ రాజుకి మాత్రం ఆమె డీజే చేసిన రెమ్యూనరేషన్‌కే చేసేలా డీల్‌ కుదిరిపోయింది.అ అంటే అప్పట్కి డీజే వల్ల ఆమె రేటు పెంచినా దిల్ రాజు సినిమాలో మాత్రం ఇప్పుడున్న రెమ్యున రేషన్ కే పని చేయాల్సి వస్తుంది. ఎంతైనా దిల్‌ రాజు బిజినెస్‌ బుర్రే బుర్ర కదూ. లేదంట్వే ఇండస్ట్రీలో అంత స్టార్ రేంజ్ కి ఎలా ఎదుగుతాడు.


English summary
Tollywood Star Producer Dil Raju makes a deal with Pooja Hegde and Harish shankar before DJ release
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu