»   » దిల్ రాజుకు ఆ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది

దిల్ రాజుకు ఆ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. మౌత్ టాక్‌‍తో పాటు రివ్యూల రేటింగ్ కూడా ఫుల్ పాజిటివ్‌గా రావడంతో సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేస్తుంది ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడం గమనార్హం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Dil Raju praise 'Pataas'

ఈ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ....‘అనిల్ రావిపూడి గురించి రైటర్ గా ఉన్నప్పటి నుండి తెలుసు. ఓసారి అతనితో స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొన్నాను. ఎంటర్టెన్మెంట్ సీన్లు బాగా చేస్తాడని తెలుసు కానీ కథపై అతనికి ఎంత పట్టు ఉందో ‘పటాస్' చూసిన తర్వాతే అర్థమైంది. విడుదల ముందు నేను ఈ సినిమా చూసాను. ఆ సమయంలో కళ్యాణ్ రామ్, అనిల్ నా వెంట లేరు. అతని టేకింగ్ చూసి షాకయ్యాను. మంచి సినిమాను ప్రేక్షకులకు రీచ్ చేయాలని నేనే నైజాం రైట్స్ తీసుకున్నాను. ఊహించినట్లే సినిమా పెద్ద హిట్టయింది' అన్నారు.


మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమా టాక్ అదిరి పోతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. అతని గత సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ఐదున్నర కోట్లకు పైగా వసూలు చేసింది.


సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

English summary
Dil Raju said, " Kalyan Ram looks very handsome and stylish in the Pataas movie. This movie will be a big hit for Kalyan Ram."
Please Wait while comments are loading...