»   » దిల్ రాజు ఇంట్లో విషాదం: గుండెపోటుతో భార్య మృతి

దిల్ రాజు ఇంట్లో విషాదం: గుండెపోటుతో భార్య మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య అనితారెడ్డి (45) గుండె పోటుతో శనివారం మధ్యాహ్నం మరణించారు. హైదరాబాద్ లోని స్వగృహంలో అనితారెడ్డి అస్వస్థతతో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సినిమాకు సంబంధించిన పని మీద దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే దిల్ రాజు ఇండియా బయల్దేరారు. సోమవారం అనితా రెడ్డి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Dil Raju wife passes away
English summary
Tollywood producer Dil Raju's wife Anitha is no more. She breathed her last on Saturday while undergoing treatment at Apollo Hospital in Hyderabad. She is reported to have died of cardiac arrest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu