»   » ఆ హీరో కక్ష కట్టాడు: ప్రముఖ కమెడియన్ ఆరోపణ

ఆ హీరో కక్ష కట్టాడు: ప్రముఖ కమెడియన్ ఆరోపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ చిత్ర సీమలో సూపర్ స్టార్ దిలీప్ వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ భావన కిడ్నాప్, లైంగిక వేధింపులు సంబంధించిన కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న దీలీప్ మీద అదే చిత్ర సీమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు అనూప్ చంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు.

కేసు విచారణలో భాగంగా ఇండస్ట్రీలో చాలా మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అనూప్ చంద్రన్‌ని పోలీసులు విచారించగా ఆశ్చర్యకర విషయాలు బయటపెట్టాడు. దిలీప్ వల్ల తన తన సినిమా కెరీర్ చాలా వరకు దెబ్బతిందని తెలిపారు.

నాపై కక్ష కట్టాడు

నాపై కక్ష కట్టాడు

దిలీప్ మిమిక్రీ బాగోలేదని గతంలో తాను అన్నందుకు తనపై కక్ష పెంచుకున్నాడని, తనకు అవకాశాలు రాకుండా చేసి పరిశ్రమ నుండి తనను బయటకు తోసేయాలని చాలా ప్రయత్నాలు చేశాడని అనూప్ చంద్రన్ ఆరోపించారు.

బెదిరించాడు, చాలా ఇబ్బందులు

బెదిరించాడు, చాలా ఇబ్బందులు

సినీ కెరీర్‌లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఒక దశలో అయితే, సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలంటూ దిలీప్ తనను బెదిరించినట్టు అనూప్ చంద్రన్ ఆరోపించారు.

అతడి కుట్ర ఆలస్యంగా అర్థమైంది

అతడి కుట్ర ఆలస్యంగా అర్థమైంది

సినిమాల్లో నటించే అవకాశాలు తనకు ఎందుకు తగ్గాయో మొదల్లో అర్థం కాలేదని, తర్వాత దీని వెనక దిలీప్ కుట్ర ఉందని చాలా ఆలస్యంగా అర్థమైందని అనూప్ చంద్రన్ పేర్కొన్నాడు.

దిలీప్

దిలీప్

మలయాళ చిత్ర సీమలో సూపర్ స్టార్‌లాగా వెలుగొందిన దీలీప్... భావన కేసు వ్యవహారంతో ఒక్కసారిగా నెగెటివ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అభిమానులు సైతం అసహ్యించుకునే స్థాయికి దిలీప్ పడిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
Malayalam actor Anoop Chandran has given statements against Dileep to the special investigation team. "I lost many film opportunities because of Dileep. I was literally shunted out," Anoop Chandran said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu