»   » ఆయన మాజీ భార్య నాగార్జున తో కళ్యాణ్ జువెల్లర్స్ లో (వీడియో)

ఆయన మాజీ భార్య నాగార్జున తో కళ్యాణ్ జువెల్లర్స్ లో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో దిలీప్ హీరోయిన్ కావ్యా మాధవన్ లు రహస్య వివాహం చేసుకొని షాక్ ఇచ్చారు . మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన కావ్య మాధవన్ కి ఇంతకుముందే పెళ్లి అయ్యింది కానీ సంవత్సరం లోనే అతడికి విడాకులు ఇచ్చింది కావ్య మాధవన్ . అలాగే దిలీప్ కి కూడా ఇంతకుముందే పెళ్లి అయ్యింది పైగా కూతురు కూడా ఉంది . కట్టుకున్న భార్య కు విడాకులు ఇచ్చాడు . గతకొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయని జోరుగా వార్తలు వచ్చాయి కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు దిలీప్ కానీ కావ్యా మాధవన్ . కానీ ఇంతలోనే సడెన్ గా ఈరోజు చాలాకొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

మలయాళ నటి మంజూ వారియర్‌ను 1998లో పెళ్లాడిన దిలిప్‌.. కొన్నేళ్ల కిందటే ఆమెకు విడాకులిచ్చాడు. ఇటు కావ్య.. కెరీర్‌ జోరుమీదున్న సమయంలోనే(2009లో) కువైట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడి.. సంవత్సరం తిరిగేలోపే విడాకులిచ్చింది. గడిచిన కొద్దికాలంగా కావ్యా, దిలిప్‌ల ప్రణయగాథపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. వీటిని ఏ దశలోనూ ఖండించని ఆ ఇద్దరూ.. అందరికి సర్‌ప్రైజ్‌ ఇస్తూ పెళ్లిపీటలెక్కారు. కావ్యతో పెళ్లికి దిలీప్‌ కుమార్తె మీనాక్షి కూడా అభ్యంతరపెట్టలేదని, ఆ ఇద్దరూ(కావ్యా, దిలీప్‌లు) కలిసి ఉండటం కంటే సంతోషకరమైన విషయం ఏదీ లేదని నటి మనేకా(నిర్మాత సురేశ్ భార్య) మీడియాతో అన్నారు. కావ్యా దిలిప్‌లు కలిసి ఇప్పటిదాకా 21 సినిమాల్లో జతకట్టారు. వాటిలో మీసమాధవన్, కాసిపట్టణం, పిన్నెయుమ్ తదితర సినిమాలు సూపర్‌హిట్లుగా నిలిచాయి.

ఇదీ మలయాళ స్టార్ హీరో దిలీప్.. స్టార్ హీరోయిన్ కావ్య మాధవన్ల కథ. వీళ్లిద్దరూ గత శుక్రవారమే పెళ్లి చేసుకున్నారు. దిలీప్ వయసు 48 ఏళ్లు కాగా.. కావ్య మాధవన్ వయసు 32 ఏళ్లే కావడం విశేషం. కావ్య ఏడేళ్లకే చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ అయింది. ఆమె తొలి సినిమాలో దిలీపే హీరో. తర్వాత ఇద్దరూ కలిసి 21 సినిమాలు చేశారు. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ మలయాళంలో ఫేమస్ హీరోయిన్. ప్రస్తుతం ఈమె నాగార్జునతో కలిసి కళ్యాణ్ జువెలర్స్ యాడ్లోనూ కనిపిస్తోంది. కావ్యతో దిలీప్ పెళ్లికి అతడి కూతురు మీనాక్షి హాజరై.. చాలా ఉల్లాసంగా గడపడం విశేషం.

బాలీవుడ్ స్టార్ అమితాబ్, టాలీవుడ్ స్టార్ నాగార్జున కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాల్లో వీరు ప్రచారం చేస్తుండగా, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్ కుమార్, మళయాలంలో నటి మంజు వారియర్ అంబాసిడర్లు. ఈ యాడ్ లో అమితాబ్, నాగార్జునలతోపాటు సౌత్ ఇండియాలోని ప్రముఖ స్టార్స్ అయిన ప్రభు అతని కుమారుడు విక్రమ్ ప్రభు, శివరాజ్ కుమార్, మలయాళీ హీరోయిన్ మంజు వారియర్ కలిసి నటించారు. పాపులర్ యాడ్ ఫిల్మ్ మేకర్ విఎ శ్రీకుమార్ దీనిని డైరెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

English summary
Dileep, Kavya Madhavan got married in a secret ceremony in Kochi on Friday morning. The wedding was kept a secret till hours before the ceremony.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu