»   » గంధరగోళం: పవన్ కళ్యాణ్ గారూ....క్లారిటీ ఇవ్వండి ప్లీజ్!

గంధరగోళం: పవన్ కళ్యాణ్ గారూ....క్లారిటీ ఇవ్వండి ప్లీజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలయికలో మల్టీ స్టారర్ మూవీ ఖరారైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కబోతున్న ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

అయితే ఈ వార్త వెలుగులోకి రాగానే....మరో షాకింగ్ రూమర్ ఫిల్మ్ నగర్లో ప్రచారంలోకి వచ్చింది. గత కొంత కాలంగా ఆలస్యం అవుతూ వస్తున్న 'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టు ఇక అటకెక్కినట్లే అని అంటున్నారు. ఆ ప్రాజెక్టు అటకెక్కడం వల్లనే పవన్ కళ్యాణ్, వెంకీ కాంబినేషన్లో సినిమా ఫైనల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Gabbar Singh 2

ఎన్నో ఆశలు పెట్టుకున్న 'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టుపై ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడంతో అభిమానులు గంధరగోళానికి గురవుతున్నారు. గబ్బర్ సింగ్ -2కు నిర్మాతగా ఉన్న పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్.....తాజాగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీకి షిప్ట్ అవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మరి ఈ గంధరగోళం, అనుమానాలపై 'గబ్బర్ సింగ్-2' చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

వెంకీ, పవన్ మల్టీ స్టారర్ మూవీ వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ మూవీ 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కబోతున్న ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'ఓ మై గాడ్' చిత్రంలో అక్షయ్ కుమార్ దేవుడి పాత్రలో నటించగా.....తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ ఆ పాత్రను పోషించనున్నారు. హిందీలో పరేష్ రావల్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషించనున్నారు. బాలీవుడ్లో ఈచిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో తెలుగులోనూ ఈచిత్రం సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. దర్శకుడు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

English summary
If strong rumours are to be believed, Pawan Kalyan has called off his much anticipated Gabbar Singh 2. In substitute, he is doing the Telugu remake of Oh My God which in turn is based on Hollywood film Man who sued God.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu