»   » ఆయన నా గాడ్ ఫాదర్... అందుకే మూడు సినిమాలకు ఓకే చెప్పేశాను: సాయి పల్లవి

ఆయన నా గాడ్ ఫాదర్... అందుకే మూడు సినిమాలకు ఓకే చెప్పేశాను: సాయి పల్లవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిదా సినిమాలో భానుమతిగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయిపల్లవి ఇప్పుడు టాలీవుడ్ హాట్ కేక్ అనటం లో సందేహం లేదు. ఈ ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది ఈ పింపుల్స్ పిల్ల. బాహుబలి 2 సినిమా తొలిరోజు కలెక్ష్లన్లు ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా వసూలు చేసింది. కాని ఫిదా సినిమా తొలి మూడు రోజుల కలెక్షన్లు మన దేశంలోనూ, యుఎస్‌లోనూ కలిపి 25 కోట్లు దాటింది.

కానీ ఒక చిన్న సినిమా... కేవలం కథను నమ్ముకుని తీసిన లోబడ్జెట్ సినిమా మూడు రోజుల్లో 25 కోట్లు సాధించడం ఆంటే ఇది బాహుబలికి ఏమాత్రం తీసిపోదని విశ్లేషకులు అంటున్నారు. ఎంతలా అంటే మూడు రోజుల్లో ఫిదా సినిమా నిర్మాణ ఖర్చులు (15 కోట్లు) వచ్చేయడమే కాదు. పది కోట్లకు పైగా లాభాల బాట పట్టటం టాలివుడ్ ప్రముఖులకు షాక్ తెప్పిస్తోంది. ఈ విజయం లో హీరో వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవి కే ఎక్కువమార్కులు పడ్డాయి. హీరో వరుణ్ తేజ్ కెరీల్లోనే అత్యధిక కలెక్షన్లు వచ్చిన సినిమా కూడా ఫిదాయే.

సామాన్యమైన విషయం కాదు

సామాన్యమైన విషయం కాదు

తెలంగాణ పిల్లగా సాయిపల్లవి నటన ప్రేక్షకుల్లోనూ, సినీ విమర్శకుల్లోనూ అద్భుతాన్ని సృష్టించింది. కేవలం ఆమెను చూడటానికే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమా థియేటర్లకు వస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. సినిమాకు ప్రాణం పోసింది సాయిపల్లవి నటనే అని చెప్పవచ్చు.

Sai Pallavi to pair up with Nani in 'MCA'
వరుసగా మూడు సినిమాలకు సిగ్నల్

వరుసగా మూడు సినిమాలకు సిగ్నల్

నిర్మాతలంతా తనవెంట పడుతూంటే సాయిపల్లవి మాత్రం శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాల్లో పని చేసేందుకు సిగ్నల్ ఇచ్చేసిందట. దీనిపై ఆమెను ప్రశ్నించడంతో... తనకు దిల్ రాజు గాడ్ ఫాదర్ అని చెప్పింది. అందుకే ఆయన బ్యానర్ లో వరుసగా మూడు సినిమాల్లో పని చేసేందుకు అంగీకరించానని చెప్పింది.

నాని సరసన 'ఎంసిఏ'

నాని సరసన 'ఎంసిఏ'

అందులో ఒకటి నాని సరసన 'ఎంసిఏ' కాగా మరొకటి ఏంటనేది క్లారిటీ రాలేదు.'ప్రేమమ్' సినిమా తో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈచిన్నది ఒకేసారి ఇలా మూడు సినిమాల ఆఫర్ కొట్టేయడం టాక్ అఫ్ ది టాలీవుడ్ అయ్యింది. హీరోయిన్లకు విపరీతమైన పోటీ ఉన్న ప్రస్తుత తరుణంలో.. ఈబ్యూటీ హవా చేసేస్తోందిగా అనుకుంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు.

మలయాళంలో కూడా

మలయాళంలో కూడా

ఇక, సాయిపల్లవి నటించడం వల్ల మలయాళంలో కూడా ‘ఫిదా'కు డిమాండ్‌ పెరుగుతోందట. ఆ సినిమాను మలయాళంలోకి డబ్బింగ్‌ చేయమని ఒత్తిడి చేస్తున్నారట. మొత్తానికి సాయిపల్లవి తెలుగులో కూడా స్టార్‌ స్టేటస్‌ అందుకుని అవకాశాలు దక్కించుకుంటోంది.

చాలా కండీషన్స్ పెట్టింది

చాలా కండీషన్స్ పెట్టింది

నిజానికి ఫిదా కోసం పల్లవి ని సంప్రదించినప్పుడే చాలా కండీషన్స్ పెట్టింది. నాకు పాత్ర నచ్చితేనే చేస్తా.. గ్లామర్ షో నావల్ల కాదు..ఇలా చాలా షరతులు విధించింది. ఐతే ప్రేమమ్ క్రేజీను దృష్టిలో పెట్టుకున్న దిల్ రాజు ఆమెతో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేయించాడట. నిజంగానే దిల్ రాజు నమ్మకం వృధా పోలేదు అనుకున్న దానికంటే పెద్ద విజయాన్నే తెచ్చిపెట్టింది సాయి పల్లవి.

English summary
The actress sai Pallavi thinks that Dil Raju is like God-Father in the Telugu Film Industry
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu