»   » బాలీవుడ్ నుండి రాజమౌళికి రూ. 20 కోట్ల ఆఫర్

బాలీవుడ్ నుండి రాజమౌళికి రూ. 20 కోట్ల ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించడం, ఏకంగా రూ. 500 కోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దర్శకుడు రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడని తెలుగువారందరికీ తెలుసు. ఆయన స్టామినా ఏమిటో దేశం మొత్తానికి తెలియడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది మాత్రం ‘బాహుబలి' సినిమా తర్వాతే.

ఓ తెలుగు సినిమా హిందీలో అవనువాదం అయి బాలీవుడ్లో రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. అదే ఆయన నేరుగా బాలీవుడ్ స్టార్లతో సినిమా తీస్తే భారీ వసూళ్లు సాధించే సినిమా తీయడం ఖాయం అని అక్కడి నిర్మాతలు నమ్ముతున్నారు. రాజమౌళి గురించి బాగా తెలిసిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ రాజమౌళిపై నమ్మకంతో ‘బాహుబలి' సినిమాను హిందీలో ప్రమోట్ చేసారు. రాజమౌళి సినిమా విషయంలో కరణ్ జోహార్ నమ్మకం నిజమైంది.

Direct a Hindi film, Rajamouli Offered 20 cr

తాజాగా కరణ్ జోహార్ రాజమౌళికి మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తూ హిందీలో ఓ సినిమా చేసి పెట్టమని అడిగారట. వాస్తవానికి రాజమౌళికి చాలా కాలం నుండి బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ విక్రమార్కుడు సినిమాను హిందీలో రీమేక్ చేయమని తొలుత రాజమౌళినే అడిగాడు సంజయ్ లీలా భన్సాలీ. అయితే అప్పటికే రాజమౌళి దృష్టంతా బాహుబలి మీద ఉండటంతో నో చెప్పాడట.

త్వరలో రాజమౌళి ‘బాహుబలి' పార్ట్ 2 షూటింగుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి ఫార్ట్ 1 భారీ విజయం సాధించడంతో రెండో భాగం...... పార్ట్ 2ను బాలీవుడ్ స్టార్లయిన హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ లతో తీస్తే మంచి ఫలితాలు వస్తాయని కరణ్ జోహార్ సూచించాడట. అయితే రాజమౌళి అందుకు టెమ్ట్ కాలేదు, తాను ముందుకు అనుకున్న ప్రకారం ప్రభాస్, రానాలతోనే సెకండ్ పార్ట్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు.

English summary
Karan Johar offered Rajamouli close to Rs 20 crore to direct a Hindi film.
Please Wait while comments are loading...