»   » పవన్ కళ్యాణ్‌కు...తనకు మధ్య దూరం గురించి సంపత్ నంది

పవన్ కళ్యాణ్‌కు...తనకు మధ్య దూరం గురించి సంపత్ నంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' చిత్రానికి తొలుత దర్శకుడిగా ఎంపికైన సంపత్ నంది అనుకోని కారణాలతో ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రవితేజతో ‘బెంగాల్ టైగర్' సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు దూరమైన విషయమై సంపత్ నంది తొలిసారి స్పందించారు. శనివారం 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను ఆ ప్రాజెక్టు నుండి బయటకు రావాల్సి వచ్చిందని, దానికి వ్యక్తులు కారణం కాదని తెలిపారు.

ఊహించని అనుభవాలు ఎదురుకావడం వల్లనే తాను ఆ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చానని మీడియాలో ప్రచారం జరుగడాన్ని ఆయన తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్ తో తన రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ తో ఇంకా ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. ఆయన నాకు కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నారు అని తెలిపారు.

అతటితో ఆగని సంపత్ నంది... త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేస్తానంటూ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తారు. పవన్ కళ్యాన్ కూడా ఇందుకు సిద్ధంగానే ఉన్నట్లు సంపత్ నంది చెప్పుకొచ్చారు. తనకు రచ్చ సినిమా చేసే అవకాశం కల్పించిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. మెగా ఫ్యామిలీకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటాను, ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలనేది నా డ్రీమ్ అన్నారు సంపత్ నంది. 

Directing the Powerstar very soon: Sampath Nandi

ప్రస్తుతం తాను రవితేజతో చేస్తున్న ‘బెంగాల్ టైగర్' స్ర్కిప్టు గతంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' చిత్రం కోసం రాసుకున్నదే అనే వార్తలను ఆయన ఖండించారు. రవితేజతో చేస్తున్న ‘బెంగాల్ టైగర్' స్క్రిప్టు పూర్తిగా డిఫరెంట్. రవితేజ కోసం రాసుకున్న స్క్రిప్టే అని తెలిపారు.

బెంగాల్ టైగర్ సినిమా విశేషాల్లోకి వెళితే...
ఈ చిత్రం విజ‌య‌వంతంగా రామెజిఫిల్మ్ సిటిలో రామ్‌ల‌క్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫిలో యాక్ష‌న్ సన్నివేశాలు రామెజిఫ‌ల్మ్‌ సిటి లో జ‌రుగుతుంది. ఈ స‌న్నివేశాలు ఫాంట‌మ్ కెమెరాతో చిత్రీక‌రిస్తున్నారు. కంటిన్యూగా జ‌రుగుతున్న ఈ షెడ్యూల్ జులై మెద‌టివారం వ‌ర‌కూ జ‌రుగుతుంది. జూన్‌20 నుండి బోమ‌న్ ఇరాని కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గోంటారు.

దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ" మాస్ మహరాజ్ రవితేజ చిత్రం అన‌గానే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఎలా వుంటాయో మా బెంగాల్ టైగ‌ర్ చిత్రం అలానే వుంటుంది. ర‌వితేజ గారి ఎన‌ర్జి స్క్రీన్ మీద ఎలా ఆడియ‌న్స్ చూడాల‌నుకుంటారో అదే రేంజిలొ చిత్రాన్నిచేస్తున్నాం.. ఉత్త‌మాభిరుచున్న‌ కె కె రాధామోహన్ గారు నిర్మాత‌. బోమ‌న్ ఇరాని జూన్ 20నుండి చిత్రంలో కొన్ని కీల‌క స‌న్నివేశాల్లో పాల్గొంటారు. త‌మ‌న్నా, రాశిఖ‌న్నా చాలా అందంగా క‌నిపిస్తారు. రామ్‌ల‌క్ష్మణ్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫిలో యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇవ‌న్ని ఫాంట‌మ్ కెమారాతో చిత్రీక‌రిస్తున్నాము.ఈ యాక్ష‌న్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.ఇక ర‌వితేజ గారు, బ్ర‌హ్మ‌నందం గారు క‌లిస్తే ఆడియ‌న్స్ న‌వ్వుల‌కి కొద‌వుండ‌దు ఈ షెడ్యూల్ జులై మెద‌టి వారం వ‌ర‌కూ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌క చ‌వితికి విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము." అని అన్నారు.

ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు ఈ షెడ్యూల్ లో న‌టించారు. బ్యాన‌ర్‌: శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమోరా: సుంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్‌రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌:కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:సంప‌త్ నంది.

English summary
Speaking about his relationship with Powerstar, Sampath said that he still maintains cordial friendship with Pawan Kalyan and that the only distance between both of them is just a phone call.
Please Wait while comments are loading...